/rtv/media/media_files/2025/07/17/cm-nithish-kumar-2025-07-17-09-25-42.jpg)
Bihar Elections Opinion Poll
Bihar Elections Opinion Poll : బీహార్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా ప్రధాన రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. రానున్న ఎన్నికల్లో ఫలితాలు ఏవిధంగా ఉంటాయనే దానిపై ఒపీనియన్ పోల్స్ కూడా వెలువడుతున్నాయి. తాజాగా 'ఐఏఎన్ఎస్- మాట్రిజ్ న్యూస్ కమ్యూనికేషన్' అనే సంస్థ తన ఒపీనియన్ పోల్స్ ను వెల్లడించింది. రానున్న ఎన్నికల్లో బీహార్‌లో ప్రధాని మోదీ పాపులారిటీ ప్రధాన 'గేమ్ ఛేంజర్' అవుతుందని, సీఎం రేసులో నితీశ్ మొదటి మొదటి స్థానంలో ఉన్నారని తెలిపింది.
కాగా ఈ ఒపీనియన్ లో మోదీ జనాకర్షణ ఎన్నికలపై ప్రధానంగా ప్రభావం చూపుతుందని 57 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే కొంతవరకు మాత్రమే ప్రభావం ఉండొచ్చని 18 శాతం మంది అభిప్రాయ పడ్డారు. బీహార్‌లో బీజేపీ మాత్రమే సుపరిపాలన అందించగలదని 35 శాతం మంది అభిప్రాయపడితే, ఆ తర్వాత స్థానంలో 18 శాతంతో జేడీయూ నిలిచింది. ఆర్జేడీకి సానుకూలంగా 13 శాతం, జన్‌సురాజ్‌కు 8 శాతం, కాంగ్రెస్‌కు 2 శాతం మంది అనుకూలంగా స్పందించారు. బీహార్ లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాలన బాగుందని, ఆయన పాలనలో శాంతిభద్రతలు బాగున్నాయనే అభిప్రాయం వెల్లడైంది. అయితే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటివి మరోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న ఎన్డీయేకు సవాళ్లు గా పరిణమిస్తాయని అభిప్రాయపడ్డారు.
అంతేకాక బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ రేసులో మొదటి స్థానంలో నిలిచారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నితీష్‌కే తమ ప్రాధాన్యత అని 42 శాతం మంది అభిప్రాయ పడ్డారు. 15 శాతంతో తేజస్వి యాదవ్ రెండో స్థానంలో ఉంటే, 9 శాతంతో జన్‌సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిషోర్ మూడో స్థానంలో ఉండటం గమనార్హం. చిరాగ్ పాశ్వాన్ (ఎల్‌జేపీ-రామ్ విలాస్)కు 8 శాతం, సమ్రాట్ చౌదరి (బీజేపీ) 3 శాతం, గిరిరాజ్ సింగ్ (బీజేపీ)కు 1 శాతం, ఉపేంద్ర కుష్వాహ (జేడీ-యూ)కు ఒక శాతం మంది మద్దతుగా నిలిచారు. ఇక 17 శాతం మంది ఎటూ తేల్చిచెప్పలేదు. మరో 4 శాతం మంది ఇతరులకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు అభిప్రాయపడ్డారు.
గడచిన పాలనలో నితీష్ కుమార్ సారథ్యంలోని ప్రభుత్వం పనీతీరు మంచి సంతృప్తిని ఇచ్చిందని 42 శాతం మంది అభిప్రాయపడ్డారు. చాలా సంతృప్తిగా ఉందని 31 శాతం మంది, సంతృప్తిగా ఉందని 31 శాతం మంది అభిప్రాయ పడడం గమనార్హం. 72 శాతం మంది శాంతి భద్రతల విషయంలో నితీష్ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. లాలూ యాదవ్ హయాంలో శాంతిభద్రతలు బాగున్నాయని 10 శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు. 12 శాతం మంది ఇద్దరి పట్లా అసంతృప్తి వ్యక్తం చేస్తే, 6 శాతం మంది ఎటూ తేల్చుకోలేకపోయారు.
Also Read : ఈవారం ఓటీటీలో సందడే సందడి.. వార్2, మిరాయ్ సహా మొత్తం ఎన్నంటే?