Woman Mutilates Brother in Law: తన చెల్లెల్ని పెళ్లి చేసుకోలేదని..మరిది ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన వదిన

తన చెల్లిని పెళ్లి చేసుకోవడం లేదని ఓ మహిళ తన మరిదిపై దారుణానికి ఒడిగట్టింది. అతడిపై కత్తితో దాడి చేసి ప్రైవేట్ పార్ట్ కట్ చేసేసింది. మరిది వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడన్న కోపంతో  ఈ పనికి పాల్పడింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

New Update
He said he didn't marry his sister..and this is the sister who cut her private parts.

He said he didn't marry his sister..and this is the sister who cut her private parts.

Woman Mutilates Brother in Law :  తన చెల్లిని పెళ్లి చేసుకోవడం లేదని ఓ మహిళ తన మరిదిపై దారుణానికి ఒడిగట్టింది. అతడిపై కత్తితో దాడి చేసి ప్రైవేట్ పార్ట్ కట్ చేసేసింది. తన చెల్లెల్ని కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడన్న కోపంతో  ఈ పనికి పాల్పడింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆగ్రాలోని బర్హన్ ఏరియాకు చెందిన యోగేష్ అనే యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. హల్ద్‌వాణీలో ఉన్న అల్ట్రాటెక్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. యోగేష్ దీపావళి పండుగ నేపథ్యంలో డ్యూటీకి సెలవు పెట్టి కుటుంబంతో గడపడానికి వచ్చాడు. అతడికి ఇదివరకే మెయిన్‌పురికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయం అయింది. నవంబర్ నెలలో పెళ్లి జరగాల్సి ఉంది. ఈ పెళ్లి జరగటం యోగేష్ అన్న రాజ్ బహుదూర్ భార్య అర్చనకు ఇష్టం లేదు.  అతను తన చెల్లిని చేసుకుంటే ఇద్దరూ ఒకే ఇంటిలో ఉండోచ్చు అనుకుంది. కానీ యోగేష్ తన చెల్లెల్ని కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఆమె భరించలేకపోయింది. దీంతో ఘాతుకానికి ఒడిగట్టింది. దీపావళి పూజ అయిపోయిన తర్వాత యోగేష్‌ను అర్చన తన గదిలోకి పిలిచింది.

కొద్దిసేపు మాట్లాడిన తర్వాత కత్తితో అతడిపై దాడి చేసింది. కోపంతో అతడి ప్రైవేట్ పార్ట్ కోసేసింది. యోగేష్ నొప్పితో విలవిల్లాడుతూ కేకలు పెట్టడంతో అతడి అరుపులు విని కుటుంబసభ్యులు అక్కడికి వచ్చారు. రక్తం ఓడుతున్న యోగేష్‌ను ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి కొంచెం విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. బాధితుడి కుటుంబసభ్యుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిందితురాలు అర్చనను, ఆమె భర్తను అదుపులోకి తీసుకుని  విచారించారు.

 మరో సంఘటనలో..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. బాధితుడిని ఉమేష్ (20)గా.. నిందితురాలిని అతడి వదిన మంజుగా పోలీసులు గుర్తించారు. ఉమేష్, మంజు సోదరి గతం కొంత కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే కుటుంబ సభ్యులు వారి పెళ్లిని వ్యతిరేకించడంతో.. మంజు చెల్లిని పెళ్లి చేసుకునేందుకు ఉమేష్ నిరాకరించాడు. ఇటీవల, అతను వేరొకరిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలిసి ఆ యువతి మనస్తాపానికి గురైంది. అయితే తన చెల్లెలి పరిస్థితిని చూసి, మంజు కోపంతో రగిలిపోయింది. తన సోదరిని వివాహం చేసుకోవడానికి నిరాకరించినందుకు మంజు.. ఉమేష్‌పై కోపం పెంచుకుంది. అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. అనంతరం ఉమేష్ నిద్రిస్తున్న సమయంలో.. అతడి ప్రైవేట్ భాగాన్ని నరికేసింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది.

స్థానిక వార్తా కథనాల ప్రకారం.. ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఉమేష్ నొప్పితో గట్టిగా అరిచాడు. ఉమేష్ కేకలు విన్న అతడి సోదరుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఉమేష్‌ను కుటుంబ సభ్యులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఉమేష్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణ సమయంలో ఈ దాడి చేసింది మంజు అని తేలింది. అనంతరం ఆమెను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రస్తుతం ఉమేష్ పరిస్థితి  నిలకడగా ఉందని తెలుస్తోంది. అతడికి గంటన్నర పాటు ఆపరేషన్ చేశారని సమాచారం. కాగా, ఉమేష్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా 7- 8 నెలలు సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. నిందితురాలు మంజు ప్రస్తుతం గర్భవతి. ఆమెని అదుపులోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడటాయని పోలీసులు భావిస్తున్నారు.

 Also Read :  దీపావళి విశిష్టత ఏంటి? ఈ పండుగ వేళ దీపాలను ఎందుకు వెలిగిస్తారంటే..!
  

Advertisment
తాజా కథనాలు