UPI Down: గూగల్‌ పే, ఫోన్‌ పే, పేటీఎం సేవలకు అంతరాయం..

భారత్‌లో యూనిఫైడ్‌ ఫేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) సేవలకు గురువారం అంతరాయం ఏర్పడింది. వినియోగదారుల నుంచి దీనిపై యూపీఐ సంస్థలకు పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి.

New Update
Google Pay, PhonePe, Paytm Users Report Outage

Google Pay, PhonePe, Paytm Users Report Outage

భారత్‌లో యూనిఫైడ్‌ ఫేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) సేవలకు గురువారం అంతరాయం ఏర్పడింది. నగదు చెల్లింపు కాకపోవడంతో వినియోగదారుల నుంచి యూపీఐ సంస్థలకు పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ సేవలకు అంతరాయం ఏర్పడటంతో HDFC, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంకు వంటి బడా బ్యాంకులపై తీవ్ర ప్రభావం పడింది. డౌన్‌డిటెక్టర్ అనే వెబ్‌సైట్‌ ద్వారా 2,147 మంది వినియోగదారులు ఈ అంతరాయంపై ఫిర్యాదులు చేశారు. దేశంలో ప్రతిరోజూ కోట్లాదిమంది గూగుల్ పే, ఫోన్‌ పే, పేటీఎం సేవలను వినియోగించుకుంటారు. అయితే గురువారం ట్రాన్సాక్షన్స్‌ జరగకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. 

Advertisment
తాజా కథనాలు