కర్ణాటకలో ముడా స్కామ్ వల్ల ఇప్పటికే చిక్కుల్లో పడ్డ సీఎం సిద్ధరామయ్యకు మరో చుక్కెదురైంది. ముడా స్కామ్‌లో సిద్ధమారయ్యనే సాక్షాలు తారుమారు చేసినట్లు మరో ఫిర్యాదు నమోదైంది. ముడా కేసుకి సంబంధించి ఫిర్యాదుదారుల్లో ఒకరైన ప్రదీప్ కుమార్ ఈ మేరకు ఈడీకి ఫిర్యాదు చేశారు. తాజా ఫిర్యాదులో సీఎం కొడుకు యతీంద్ర పేరును కూడా జోడించారు. ఇక ముడా కుంభకోణం కేసులో ప్రస్తుతం సిద్ధరామయ్య విచారణ ఎదుర్కొంటున్నారు. ఎప్పటికైన సత్యమే గెలుస్తుందన్న నమ్మకం తనకు ఉందని తెలిపారు. మైసూరులోని చాముండేశ్వరీ ఆలయ ప్రాంగణంలో దసరా ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
Also Read: ఈషా ఫౌండేషన్‌కు ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
'' ప్రజలు, అమ్మవారి ఆశీస్సులు ఉన్నంత కాలం తనను ఎవరూ కూడా ఏమి చేయలేరు. నేను ఏ తప్పు చేయలేదు. ఒకవేళ తప్పు చేసి ఉంటే ఇంతకాలం రాజకీయాల్లో ఉండటమనేది అసాధ్యం. జేడీఎస్ ఎమ్మెల్యే ముడా సభ్యుడు జేటీ దేవగౌడకు నిజం ఏంటో తెలుసు. అందుకే వేరే పార్టీలో ఉన్నా కూడా నిజం మాట్లాడుతున్నారు. ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నానని'' సిద్ధరామయ్య అన్నారు.