Israel: గాజాపై ఇజ్రాయెల్ మళ్ళీ దాడి..దాదాపు వంద మంది మృతి

గాజా మీద ఇజ్రాయెల్ ఇంకా దాడులు చేస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. దీంట్లో 50 మంది చిన్నారులతో సహ 84 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 192 మంది గాయపడ్డారు. 

New Update
12

Israel Attacks On Gaza: 

పూర్తిగా హమాస్ తుడిచిపెట్టేవరకూ దాడులు ఆపమని ఇజ్రాయెల్ ఎప్పుడో ప్రకటించింది. దానికి తగ్గట్టే ఇంకా అటాక్స్ చేస్తూనే ఉంది ఈ దాడుల్లో వేల మంది అమాయక గాజా వాసుల ప్రాణాలు పోతున్నా...లెక్క పెట్టడం లేదు. తాజాగా మ్ళీ గాజా మీద అటాక్ చేసింది ఇజ్రాయెల్. ఇందులో దాదాపు వంద మంది దాకా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. గత 24 గంటల్లో గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. దీంట్లో 50 మంది చిన్నారులతో సహ 84 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 192 మంది గాయపడ్డారు. మరోవైపు లెబనాన్ మీ కూడా విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. ఇదే 24 గంటల్లో లెబనాన్‌లో కూడా 30 మరణించారని అక్కడి ఆరోగ్యశాఖ లెక్కలు తెలిపింది. లెబనాన్‌లోని బెకా వ్యాలీలోని కనీసం 25 పట్టణాలు, గ్రామాలపై శుక్రవారం భారీగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు.

ఉత్తర గాజాలో నివాస భవనాల మీద ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఖాన్ యూనిస్‌లో వైమానిక దాడిలో హమాస్ సీనియర్ అధికారి ఇజ్ అల్-దిన్ కస్సాబ్‌ను చంపినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. గాజా కాల్పుల విరమణ చర్చలను ఇజ్రాయెల్ సీరియస్‌గా తీసుకోవడం లేదని, యుద్ధాన్ని శాశ్వతంగా నిలిపివేయాలనే డిమాండ్‌లకు అస్సలు రెస్పాండ్ కావడం లేదని హమాస్ అధికారులు చెబుతున్నారు. ఇక లెబనాన్‌లోని బాల్‌బెక్-హెర్మెల్ ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడుల్లో 52 మంది మరణించగా 72 మంది గాయపడ్డారు.

Also Read: HDFC: యూపీఐ కస్టమర్లకు షాక్.. రెండు రోజులు సేవల్ బంద్!

Advertisment
Advertisment
తాజా కథనాలు