/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
Shibu Soren:
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ కన్నుమూశారు(Shibu Soren Death News). దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన కుమారుడు, ప్రస్తుత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించి ఆయన ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు చేశారు. ఈ పోరాటంలో ఆయన విజయం సాధించి జార్ఖండ్ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కృషి చేశారు. అనంతరం ఆయన మూడు సార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పని చేశారు.
Also Read: CM రేవంత్ రెడ్డికి ఇచ్చిపడేసిన MLA రాజ్ గోపాల్ రెడ్డి.. సంచలన ట్వీట్
आदरणीय दिशोम गुरुजी हम सभी को छोड़कर चले गए हैं।
— Hemant Soren (@HemantSorenJMM) August 4, 2025
आज मैं शून्य हो गया हूँ...
జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటంలో శిబు సోరెన్ కీలక పాత్ర పోషించారు. గిరిజనుల హక్కుల కోసం, వారి అణచివేతకు వ్యతిరేకంగా పోరాడేందుకు 1972లో ఆయన జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించారు. ఈ పార్టీ జార్ఖండ్ రాజకీయాల్లో ఒక బలమైన శక్తిగా ఎదిగింది. శిబు సోరెన్ మూడుసార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ, ఏసారి కూడా పూర్తి కాలం పాలించలేకపోయారు.
Former Jharkhand CM Shibu Soren Passes Away:
— Odishalinks (@odisha_links) August 4, 2025
🔹 Jharkhand Mukti Morcha (JMM) patriarch and former CM Shibu Soren has passed away.
🔹 Confirmation came from his son and current Jharkhand CM Hemant Soren.
🔹 A towering figure in tribal politics, his demise marks the end of an era.… pic.twitter.com/5Qfg0d3non
- మొదటిసారి 2005లో కేవలం 10 రోజులు మాత్రమే అధికారంలో ఉన్నారు.
- రెండోసారి 2008 నుండి 2009 వరకు,
- మూడోసారి 2009 నుండి 2010 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఆయన దుమ్కా లోక్‌సభ నియోజకవర్గం నుంచి 8సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇది ఆయనకు ఆ ప్రాంతంలో ఉన్న అపారమైన ప్రజాదరణకు నిదర్శనం. ఆయన యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో బొగ్గు శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. శింబు సోరైన్ కొడుకు హేమంత్ సోరెన్ ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.