బైక్‌ని ఢీకొట్టిన BMW కారు.. ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ మృతి

ఢిల్లీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవ్‌జోత్ సింగ్ (52) దుర్మరణం చెందారు. ఆయన బైక్‌పై వెళ్తుండగా BMW కారు వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నవ్‌జోత్ సింగ్ భార్య సందీప్ కౌర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు.

New Update
Finance Department Deputy Secretary

ఢిల్లీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవ్‌జోత్ సింగ్ (52) దుర్మరణం చెందారు. ఆయన బైక్‌పై వెళ్తుండగా BMW కారు వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నవ్‌జోత్ సింగ్ భార్య సందీప్ కౌర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ సంఘటన ఆదివారం రాత్రి ఢిల్లీ కెంట్ మెట్రో స్టేషన్ సమీపంలోని రింగ్ రోడ్డుపై జరిగింది. బంగ్లా సాహిబ్ గురుద్వారా నుంచి బైక్‌పై ఇంటికి తిరిగి వస్తున్న నవ్‌జోత్ సింగ్ దంపతులను BMW కారు ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు నవ్‌జోత్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ప్రమాదంపై నవ్‌జోత్ సింగ్ కుమారుడు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఆసుపత్రులు ఉన్నప్పటికీ, తన తల్లిదండ్రులను సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీటీబీ నగర్‌లోని ఒక ఆసుపత్రికి ఎందుకు తరలించారని ఆయన ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన తర్వాత కారు నడిపిన మహిళ కూడా గాయపడినట్లు చెప్పి తన తల్లిదండ్రులతో పాటు ఆసుపత్రికి వచ్చిందని, అయితే ఆమె ఆచూకీ ఇప్పుడు లేదని ఆరోపించారు. ఆమెకు నకిలీ మెడికో-లీగల్ సర్టిఫికెట్ తయారు చేసేందుకు ఆసుపత్రి సిబ్బంది సహకరిస్తున్నారని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారు నడిపిన గగన్‌ప్రీత్ అనే మహిళ, ఆమె భర్త పరీక్షిత్ కలిసి క్షతగాత్రులను టాక్సీలో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గురైన రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాలు కూడా ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించాయి.

ఈ విషాద ఘటన కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక ఉన్నత స్థాయి అధికారి ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించడంపై పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు ఎలాంటి పురోగతి సాధిస్తారో వేచి చూడాలి.

Advertisment
తాజా కథనాలు