అమూల్ నెయ్యిపై తప్పుడు ప్రచారం చేసినందుకు.. ట్విట్టర్ యూజర్లపై ఫిర్యాదు

శ్రీవారి లడ్డూలో అమూల్ నెయ్యి ఉపయోగించారని ఏడు వేర్వేరు అకౌంట్ల నుంచి ట్విట్టర్‌లో తప్పుడు ప్రచారం జరిగింది. దీనిపై అమూల్ మండిపడుతూ.. ఏడుగురిపై గుజరాత్‌తో కేసు పెట్టింది. ఒక్కసారి కూడా తిరుపతి లడ్డూ తయారీకి తాము నెయ్యి సరఫరా చేయలేదని స్పష్టం చేసింది. 

amul dairy issue
New Update

శ్రీవారి లడ్డూలో కల్తీపై ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తిరుపతి లడ్డూలో అమూల్ సంస్థకు చెందిన నెయ్యిని ఉపయోగించారని ట్విట్టర్‌లో ప్రచారం జరిగింది. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసిన వారిపై అమూల్ మండిపడుతూ.. ట్విట్టర్ యూజర్లపై కేసు పెట్టింది. అమూల్ కంపెనీ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రయత్నించిన ఏడుగురిపై గుజరాత్‌లో అహ్మదాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో సంస్థ ఫిర్యాదు చేసింది. ఏడు వేర్వేరు అకౌంట్ల నుంచి ట్విట్టర్‌లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినందుకు పలు సెక్షన్ల కింద పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు.  

నాణ్యతలో అమూల్ బెస్ట్..

అమూల్ బ్రాండ్‌తో లింక్ అయిన గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ పాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. తిరుపతి లడ్డూ తయారీకి అమూల్ కంపెనీకి చెందిన నెయ్యిని ఇప్పటివరకు సరఫరా చేయలేదని జీసీఎంఎంఎఫ్ స్పష్టం చేసింది. అమూల్ ప్రొడక్ట్స్ అన్ని నాణ్యతలో బెస్ట్ అని, కల్తీ నెయ్యిని కస్టమర్లకు విక్రయించడం లేదని తెలిపింది. మొత్తం 36 లక్షల కుటుంబాలు అమూల్‌లో వర్క్ చేస్తున్నారని.. ఇలా తప్పుడు సమాచారం ఇస్తే వారి జీవనోపాధి మీద ప్రభావం పడుతుందని కంపెనీ తెలిపింది. పూర్తిగా తెలుసుకోకుండా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే ఇలాంటి చర్యలు తప్పకుండా తీసుకోవాల్సి వస్తుందని అమూల్ వెల్లడించింది. 

#gujarat #amul #Tirupati Laddu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe