BIG BREAKING: ఢిల్లీ బాంబు పేలుడు వెనుక ఉగ్రకుట్ర !

ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో ఓ కారులో బాంబు పేలుడు జరగడం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరికొందరు గాయాలపాల్యయారు. అయితే ఈ బాంబు పేలుడు వెనుక ఉగ్ర కుట్ర ఉండొచ్చని పలువురు అనుమానిస్తున్నారు.

New Update
BREAKING

BREAKING

ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో ఓ కారులో బాంబు పేలుడు జరగడం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరికొందరు గాయాలపాల్యయారు. అయితే ఈ బాంబు పేలుడు వెనుక ఉగ్ర కుట్ర ఉండొచ్చని పలువురు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఘటనాస్థలానికి పోలీసులు, భద్రతా సంస్థలు చేరుకుని దర్యాప్తు చేస్తున్నాయి. అయితే సోమవారం జమ్మూకశ్మీర్‌ పోలీసులు జైషే మహమ్మద్ , అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్‌ ఉగ్ర సంస్థలతో సంబంధం ఉన్న ఓ మాడ్యూల్‌ను ఛేదించారు.  

Also Read: బీహార్‌లో కీలకంగా మారనున్న రెండో దశ ఎన్నికలు.. ఓట్లు చీల్చనున్న MIM ?

శ్రీనగర్, అనంతనాగ్‌, గండేర్బాల్, షోపియన్, ఫరీదాబాద్‌, సహరాన్‌పూర్‌ ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల నుంచి పోలీసులు మందుగుండు సామాగ్రి, ఏకే 56 రైఫిల్‌, పేలుడు పదార్థాలు, ఎలక్ట్రిక్ సర్క్యూట్లు, బ్యాటరీలు, రిమోట్ కంట్లోల్లు, IED తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.  అయితే సోమవారం రాత్రికే ఎర్రకోట సమీపంలో కారులో బాంబు పేలుడు సంభవించింది. అయితే ఈ దాడికి ఉగ్రవాదులతో సంబంధం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

మరోవైపు గుజరాత్‌లో భారీ ఉగ్ర కుట్రకు యత్నించిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్‌తో సహా మరో ఇద్దరు ఐసిస్‌ సానుభూతిపరులను కూడా గుజరాత్‌ ATS పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మొహియుద్దీన్‌ తన ఇంట్లోనే రైసిన్‌ అనే విష రసాయనాన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అతడు  ఉగ్ర దాడుల్లో భాగంగా విషపదార్థమైన రైసిన్‌ను ఓ ఆయుధంగా మార్చేందుకు యత్నించినట్లు అధికారులు పేర్కొన్నారు. తాజాగా ఢిల్లీలో బాంబు పేలుడు జరగడంతో దీని వెనుక ఉగ్రకుట్రే ఉండొచ్చనే అనుమానాలనకు మరింత బలం చేకూరుతోంది.  

Advertisment
తాజా కథనాలు