BIG BREAKING: ఢిల్లీలో బాంబు పేలుడు

ఢిల్లీలోని ప్రశాంత్‌ విహార్‌లో బాంబు పేలుడు సంభవించింది. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ మీడియా సమావేశం నిర్వహిస్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

New Update
DELHI Bomb Blast

ఢిల్లీలోని ప్రశాంత్‌ విహార్‌లో బాంబు పేలుడు సంభవించింది. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ మీడియా సమావేశం నిర్వహిస్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం ఈ బాంబు పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రపంచంలో ఢిల్లీ నగరం భద్రత లేని నగరంగా ఉందనే అంశంపై ఆయన మాట్లాడుతుండగా ఈ దాడి చేసుకోవడం గమనార్హం.

సమాచారం మేరకు 4 అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. పేలుళ్లు జరిగిన చోట పోలీసులు తెల్లటి పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ బాంబు పేలుడు ఘటనలో ఓ వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. కొన్నిరోజుల క్రితం సీఆర్‌పీఎఫ్‌ స్కూల్‌ ఆవరణలో కూడా బాంబ్ బ్లాస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా పోలీసులు ఇలాంటిదే తెల్లటి పౌడర్‌ను గుర్తించారు. అయితే ఈ పేలుళ్ల వెనుక కుట్రకోణం ఉందనే అనుమానాలు తలెత్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisment
Advertisment
తాజా కథనాలు