ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించారు. శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఆయన భాదపడ్డారు. డాక్టర్లు ఆయనను ఐసీయూ ఉంచి చికిత్సను అందించనప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కొద్దిసేపటి క్రితం మా.ఈ ప్రధాని కన్నుమూశారు. Manmohan At Hospital మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు పదేళ్ల పాటు ప్రధానిగా సేవలందించిన సంగతి తెలిసిందే. ఆయన హయాంలో జీడీపీ వృద్ధి రేటు పెరిగింది. అంతేకాదు మాజీ ప్రధాని పీవీ నరసింహరావు హయాంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల్లో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. మన్మోహన్ సింగ్ ఒక మౌనముని. తను చేయాలనుకున్న పనిని సైలంట్‌గా చేసుకుని వెళ్ళిపోయే వ్యక్తిత్వం ఆయనది. మాటల ద్వారా కాకుండా చేత ద్వారా తన పనితనాన్ని అందరికీ చూపించి ప్రశంసలు అందుకున్నారు. ఏనాడు తాను ఇంత చేశాను అని చెప్పుకుని ఎరుగరు. అన్నిటికి మించి అత్యంత నిస్వార్థ నాయకుడిగా అందరికీ గుర్తుండిపోతారు. Also Read: Cong: రేపటి నుంచి కాంగ్రెస్ జై బాపు, జైభీమ్, జై సంవిధాన్ ప్రచారం...