పోలవరం ప్రాజెక్టుపై అంబటి రాంబాబు సంచలన కామెంట్స్ పోలవరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి అంబటి రాయుడు కీలక కామెంట్స్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుకు మరోసారి తీవ్ర విఘాతం ఏర్పడిందని అన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 01 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి పోలవరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి అంబటి రాయుడు కీలక కామెంట్స్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుకు మరోసారి తీవ్ర విఘాతం ఏర్పడిందని అన్నారు. '' పోలవరానికి ఉరి వేస్తున్నారు. సరైన సమయంలో మేము ప్రాజెక్టు పూర్తి చేయలేకపోవడానికి చంద్రబాబు చేసిన తప్పులే కారణమని చెప్పాను. పోలవరాన్ని భ్రష్టు పట్టించి కేవలం బ్యారేజీగా చేసేందుకు కూటమీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజ్ గొప్పదని చంద్రబాబు మోసం చేశారు. Also Read: లైంగికదాడి ఆరోపణలపై స్పందించిన నాగార్జున.. టెస్టులకు సిద్ధం అంటూ! పోలవరాన్ని సర్వనాశనం చేయబోతున్నారు. జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు అసలు కంటే కొసరు ఎక్కువ మాట్లాడారు. 194 టీఎంసీల నిల్వ సామార్థ్యం నిర్మిస్తేనే పూర్తి ఫలితాలు దక్కుతాయి. 41.15 అడుగుల ఎత్తుకే నిర్మించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. పూర్తి అవగాహన లేకుండా రామానాయుడు మాట్లాడుతున్నారు. ఏ ప్రాజెక్టు అయినా దశల వారీగానే నిర్మాణం చేస్తారు. ప్రాజెక్టు మాన్యువల్ ప్రకారం పోలవరం కూడా దశల వారీగానే నిర్మాణం చేస్తారు. నాలుగు దశల్లో నిర్మాణం ఖర్చు ఏ దశలో ఎంత అవుతందని కేంద్రం అడిగింది. Also Read: రాష్ట్రంలో రాతపరీక్ష లేకుండా జాబ్స్.. రూ.50వేల జీతం, అర్హులు ఎవరంటే? దశల వారీగా నిర్మాణ ఖర్చు ఎంత అని మాత్రమే పంపించాము. చంద్రబాబు సీఎం అయిన తర్వాత 12 వేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్రం క్యాబినెట్ ఒప్పుకుంది. దశల వారీగా ఎంతెంత నిధులు అవసరమవుతాయో ఆ నిధులు విడుదల చేసేందుకు పీబీఐ ఒప్పుకుంది. కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఫస్ట్ ఫేజ్ నిర్మాణం గురించి మాత్రమే ఉంది. సెకండ్ ఫేజ్ గురించి క్యాబినెట్ నోట్‌లో లేదు. ఆ తర్వాత రాష్ట్రానికి రాసిన లేఖలో కూడా సెకండ్ ఫేజ్ గురించి లేదు. దీన్ని బట్టి పోలవరం ఎత్తు 41.15 అడుగుల వరకే అని అర్థం అవుతుంది. పూర్తి స్థాయి నిర్మాణం చేస్తామని ప్రధాని మోదీ చేత లేదంటే కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చెప్పించాలని'' మంత్రి అంబటి అన్నారు. #andhra-pradesh #telugu-news #ambati-rayudu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి