Congress Letter To EC:
కేంద్ర ఎన్నికల సంఘం మీద కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. తన స్వతంత్రతను ఈసీ పూర్తిగా పక్కన పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించింది. ఎన్నికల సంఘం తనకు తాను క్లీన్‌చిట్ ఇచ్చుకోవడం తమనేమీ ఆశ్చర్యమేమీ లేదని వ్యాఖ్యానించింది. కానీ ఈసీ చెప్పిన తీరు, వాడిన భాష, పార్టీపై చేసిన ఆరోపణలు తాము తిరిగి లేఖ రాసేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుబు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. ఈసీ ఇలా మాట్లాడ్డం సరైన విషయం కాదని..ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోకపోతే తాము కోర్టుకు వెళ్ళవలసి వస్తుందంటూ కాంగ్రెస్ లేఖ రాసింది.
ఇది కూడా చదవండి: Ind vs Nz: తిప్పేసిన స్పిన్నర్లు.. 235 పరుగులకు కివీస్ ఆలౌట్!
అంతకు ముందు ఓ జాతీయ పార్టీ నుంచి ఇలాంటి ఆరోపణలు ఊహించలేదు అంటోంది ఈసీ. హరియాణా ఎన్నికల లెక్కింపు సమయంలో అవతవకలు చోటు చేసుకున్నాయన్న కాంగ్రెస్ ఆరోపణలను ఈసీ తోసిపుచ్చింది. కాంగ్రెస్ ఎప్పుడూ ఇలానే చేస్తోందని...ఇంతకు ముందు కూడా ఎన్నికల ఫలితాల విశ్వసనీయతపై సందేహాలను లేవనెత్తిందని విమర్శించింది. దేశంలో ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో భాగంగా రాజకీయ పార్టీలు పంచుకునే అభిప్రాయాలను ఎన్నికల సంఘం స్వీకరిస్తోంది. ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదుల పరిష్కారానికి కట్టుబడే ఉంటాం అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఈసీ లేఖ రాసింది. కానీ కాంగ్రెస్ ఎలాంటి ఆధారాలు చూపకుండా ఎన్నికల ప్రక్రియలో రాజీ పడ్డారని చెబుతున్నారని తెలిపింది. గతంలో మాదిరిగా సాధారణ సందేహాలనే కాంగ్రెస్ లేవనెత్తిందని.. వారి విధానాలను మార్చుకోవాలని సూచించింది.
ఇది కూడా చదవండి: త్వరలో ఆ చట్టం తీసుకొస్తాం.. పవన్ సంచలన ప్రకటన!