EARTHQUAKE: భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలంటే..?

భూకంపాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలో తెలిస్తే ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చు. టేబుల్స్, కబోర్డ్స్ లాంటి గట్టి ప్రదేశాల్లో దాక్కొవాలి. బిల్టింగ్ కూలీపోయే పరిస్థితి ఉంటేనే ఇంట్లోనుంచి బయటకు వెళ్లాలని నిపుణులు చెబుతున్నారు.

author-image
By K Mohan
New Update
earthquake 0000

earthquake 0000 Photograph: (earthquake 0000)

EARTHQUAKE: నేపాల్ సరిహద్దుల్లో టిబెట్ సమీపంలో ఈరోజు (డిసెంబర్ 7) ఉదయం భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 95 మంది మరణించారు. అలాగే ఇండియాలోని పలు ప్రాంతాలు.. బిహార్, అసోం, పశ్చిమ బెంగాల్‌లో సైతం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. టిబెట్ రాజధాని లాసాకు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని షిగాట్సే నగరంలోని టింగ్రి కౌంటీ వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించారు. వెంటవెంటనే పలుసార్లు భూమి కంపించింది. 2015లో నేపాల్‌లో 7.8 తీవ్రతతో వచ్చిన భూకంపంలో దాదాపు 9 వేల మంది మరణించిన విషయం తెలిసిందే. 2022 జూన్ 22న అఫ్గానిస్తాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో వెయ్యి మంది మరణించారు.

Also Read : 'అన్ స్టాపబుల్' లో తారక్ ప్రస్తావన.. స్పందించిన నాగవంశీ

టర్కీ, సిరియా విషాదాలు..

టర్కీ, సిరియా, నేపాల్, జపాన్, కాలిఫోర్నియాలో వచ్చిన భూకంపాలు ఇప్పటి సంభవించిన భారీ భూకంపాలు.. వీటిల్లో వందల మంది మరణించారు. టర్కి, సిరియాలో 2023 ఫిబ్రవరి 8 న సంభవించిన విపత్తులో 11, 200 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా భారత్‌లో కూడా తరుచూ అక్కడో ఇక్కడో భూకంపాలు సంభవిస్తున్నాయి. ఢిల్లీ, హైదరాబాద్‌లో స్వల్ప భూకంపాలు ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అయితే భూకంపాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం..

సర్వేలు ఏం చెబుతున్నాయ్.. 

భూకంపం ఎప్పుడు వస్తుందో కచ్చితంగా అంచనా వేయడం కష్టం అవుతుండటంతో మనం అన్ని వేళలా సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతంలో మీరు జీవిస్తే, ఎమర్జెన్సీ ప్యాక్ వెంట ఉంచుకోవడం మంచిదని సైంటిస్ట్ హిక్స్ సూచించారు. ఎమర్జెన్సీ ప్యాక్‌లో మంచినీళ్లు, ఒక టార్చ్‌లైట్, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఆహారం ఉంచుకోవాలని చెప్పారు. ఆ కిట్‌లో కొంత మనీ, మెడిసిన్, ముఖ్యమైన డాక్యుమెంట్లు కూడా పెట్టుకోవాలని రెడ్ క్రాస్ సూచిస్తోంది. భూకంపం వచ్చినప్పుడు ఉన్నచోటే కదలకుండా ఉంటే గాయాల పాలయ్యే అవకాశం తక్కువని అమెరికా జియోలాజికల్ సర్వే చెబుతోంది. భూకంపం వచ్చినప్పుడు బయటకు పరిగెత్తడం, వేరే గదుల్లోకి వేగంగా పరిగెత్తడం లాంటివి చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తు్న్నారు. కాళ్లు చేతులు దగ్గరకు ముడుచుకొని గట్టి టేబుల్ లేదా డెస్కు కిందకు వెళ్లి తలదాచుకోవాలి. దీంతో పైనుంచి మనమీద వస్తువులు పడకుండా ఉంటాయి. బిల్డింగ్ వన్ సైడ్ ఒరిగిపోతున్నా.. ప్రకంపనలు ఆగేవరకు టేబుల్ కాళ్లను గట్టిగా పట్టుకొని అక్కడే కదలకుండా కూర్చోవాలి. ఒక వేళ బిల్డింగ్ పూర్తిగా కూలిపోయే పరిస్థితి ఉంటేనే అక్కడి నుంచి బయటకు వచ్చేయాలి.. ఓ విశాలమైన ప్రదేశం.. తారు లేదా, సిమెంట్ రోడ్డు మీద నిలబడాలి.

భూకంపం వచ్చినప్పుడు ఏం చేయాలి..? ఏం చేయకూడదు..? - Earthquake Safety Tips

కొంతమంది ఇంటి గుమ్మాలు గట్టిగా ఉంటాయని, అక్కడకు వెళ్లి నిలబడుతుంటారు. అయితే, అక్కడికంటే టేబుల్ కిందే సురక్షితంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. భూకంప తీవ్రత ఎక్కువైతే ఫస్ట్ విండోస్‌కు వాడే అద్దాలు ధ్వంసం అవుతాయి. అలాంటి ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలి. భూకంపంలో ఎక్కువ మరణాలకు పైనుంచి పడిపోవడం, టీవీలు, బుక్ కేస్‌లు లాంటివి పైనపడటం వల్లే సంభవిస్తున్నాయని ఎర్త్‌క్వేక్ కంట్రీ అలయన్స్ చెబుతోంది. అలాంటి వస్తువలకు దూరంగా ఉండాలి. భూకంపం సమయంలో ఎలా స్పందించాలో ముందుగానే ట్రైన్ అయి ఉండటం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.  ఇందుకోసం తరుచూ భూకంపాలు సంభవించే దేశాలు అక్కడి పౌరులకు మాక్ డ్రిల్స్‌‌తో శిక్షణ ఇస్తుంటాయి. జపాన్, ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాలు ఎర్త్‌క్వేక్ డ్రిల్స్ నిర్వహిస్తుంటాయి. జపాన్ పాఠశాలల్లో సంవత్సరానికి రెండు సార్లు భూకంప డ్రిల్స్ నిర్వహిస్తారు. తైవాన్ దేశవ్యాప్తంగా ఎమెర్జెన్సీ డ్రిల్స్‌ చేపడుతుంది. భూకంపం కారణంగా గ్యాస్ పైప్‌లైన్‌లు దెబ్బతిని అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తుంటాయి. 1906లో శాన్‌ఫ్రాన్సిస్కో భూకంపంలో 3,000 మందికిపైగా మరణించారు. వీటిలో ఎక్కువ మరణాలకు గ్యాస్ పైప్‌లైన్లు పేలిపోవడమే కారణం. అందుకే బ్లాస్ట్ అయ్యే ప్రాంతాలకు దూరంగా ఉండాలి. 

Also Read: America: భీక‌ర‌ మంచు తుఫాన్ తో వణుకుతున్న అమెరికా..7 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ!

మందుగా గుర్తిస్తే ముప్పు తక్కువే..! - How to Survive an Earthquake

భూకంపాన్ని ఎంతముందుగా గుర్తించగలిగితే.. అంత నష్టాన్ని నివారించవచ్చు. అందుకోసం శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తు్న్నారు. 2022 అక్టోబరు 25న కాలిఫోర్నియా తీరంలో 5.1 తీవ్రతతో భూకంపం వచ్చినా.. ఆస్తి నష్టమూ సంభవించలేదు. ఎందుకంటే భూకంపం రాకముందే అక్కడి ప్రజలకు అమెరికా జియోలాజికల్ సర్వే నుంచి మెసేజ్‌లు వెళ్లాయి. ప్రకంపనలకు ముందే అలర్ట్ చేసే టెక్నాలజీ కోసం కాలిఫోర్నియా వర్సిటీ నిపుణులు, యూఎస్‌జీఎస్‌తో కలిసి గూగుల్ పనిచేస్తోంది. రెండు వైపుల నుంచి డేటాను ఈ టెక్నాలజీ తీసుకుంటోంది. మొదటిది ప్రకంపనలను గుర్తించేందుకు ఏర్పాటుచేసిన 700 సైస్మోమీటర్ల నెట్‌వర్క్. వీటిని కాలిఫోర్నియా మొత్తంగా కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాలిఫోర్నియా బెర్కెలీ యూనివర్సిటీ, యూఎస్‌జీఎస్ కలిసి ఏర్పాటుచేశాయి.

Also Read: Garikipati అలాంటోడా...  సంచలన ఆరోపణలు చేసిన మొదటి భార్య

రెండోది గూగుల్ సొంత నెట్‌వర్క్. ప్రజల దగ్గరుండే ఫోన్లను దీని కోసం గూగుల్ ఉపయోగించుకుంటోంది. గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్లలోనూ యాక్సెలెరోమీటర్ సెన్సార్ ఉంటుంది. ఫోన్ కొంచెం షేక్ అయినా ఇవి వెంటనే గుర్తిస్తాయి. ఫోన్ కదలగానే డిప్స్లే ఆన్ అవ్వడానికి ఇవి పని చేస్తాయి. ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్ సిస్టమ్(ఏఈఏఎస్)కు ఫోన్లు ఆటోమేటిక్‌గా డేటాను చేరవేసేందుకు గూగుల్ ఓ కొత్త సెటప్‌ను తీసుకొచ్చింది. దీనికి పర్మిషన్ ఇస్తే, భూకంపం నుంచి ఫస్ట్ వచ్చే ప్రైమరీ వేవ్స్‌ను ఫోన్లు గుర్తుపట్టిన వెంటనే ఏఈఏఎస్ పంపిస్తాయి. వెంటనే ఆ లోకేషన్‌లో ఎర్త్ కేక్ అలర్ట్ మెస్సేజ్‌లు వస్తాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు