/rtv/media/media_files/2025/07/10/delhi-2025-07-10-09-26-42.jpg)
దేశ రాజధానిలో మరోసారి భూకంపం సంభవించింది. ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్) అంతటా ప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం సాయంత్రం భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రతగా నమోదైంది. భూకంపం 10 కిలోమీటర్ల లోతులో ఉద్భవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సిఎస్) వెల్లడించింది.
EQ of M: 3.7, On: 11/07/2025 19:49:43 IST, Lat: 28.68 N, Long: 76.72 E, Depth: 10 Km, Location: Jhajjar, Haryana.
— National Center for Seismology (@NCS_Earthquake) July 11, 2025
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0@DrJitendraSingh@OfficeOfDrJS@Ravi_MoES@Dr_Mishra1966@ndmaindiapic.twitter.com/Msp1JNfEb9
BREAKING News 🚨-
— Raj Kshatriya Kumawat (@Rajkumawat491) July 11, 2025
Earthquake tremors felt in Delhi
2nd earthquake of week
Everyone be safe...#earthquake#Delhi#earthquakeindelhi
రిక్టర్ స్కేలుపై 4.4గా
గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కూడా ఎన్‌సిఆర్ అంతటా ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. రెండు రోజుల వ్యవథిలో ప్రకంపనలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు. గతంలో కూడా ఢిల్లీలో అనేక సార్లు భూకంపాలు సంభవించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 17, 2025న కూడా ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో 4.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. జూన్ 8, 2025న స్వల్పంగా 2.3 తీవ్రతతో కూడిన భూకంపం కూడా నమోదైంది.
2 earthquake near Delhi , while epicentre being the same both the day !!
— Ayaan (@ayaan_messi) July 11, 2025