అక్టోబర్ నెలలో స్కూళ్లు, కాలేజీలకు చాలా సెలవులు ఉన్నాయి. ఇటీవలే దసరా సందర్భంగా స్కూళ్లకు దాదాపు చాలా రోజులు సెలవులు ఇచ్చారు. దీంతో స్కూల్ పిల్లలు ఆనందంగా జరుపుకున్నారు. అంతేకాకుండా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సైతం కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. అయితే మళ్లీ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. దీంతో అయ్యో అప్పుడే సెలవులు అయిపోయాయా అంటూ కాస్త నిరాశతో స్కూళ్లకు వెళ్తున్నారు.
ఇది కూడా చదవండిః RTV Exclusive: అఘోరీ అసలు పేరు శ్రీనివాస్.. తల్లిదండ్రుల సంచలన నిజాలు
దీపావళికి ఒకరోజే సెలవు
ఈ క్రమంలో మళ్లీ మరో నాలుగు రోజుల పాటు సెలవులు రానున్నాయన్న వార్త వారిలో సరికొత్త ఉత్సాహం నింపింది. ఇదే నెలలో వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి. అయితే ఆ సెలవులు మరెప్పుడో కాదు.. దీపావళికే. అరే దీపావళికి నాలుగు రోజులా? అని ఆశ్చర్యపోకండి. దీపావళికి ఒకరోజే కానీ.. మిగతా మూడు రోజులు ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది కూడా చదవండిః మనిషి మాంసం తింటా అంటున్న మహిళా అఘోరి.. అసలు చట్టం ఏం చెబుతోంది?
అక్టోబర్ 31 వ తేదీ (గురువారం) జరగబోయే దీపావళి పండుగ కోసం యావత్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇంటిళ్లి పాది ఆనందోత్సహాలతో జరుపుకునే ఈ పండుగ కోసం వేరు వేరు ప్రాంతల నుంచి సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. అయితే ఈ దీపావళికి ఒక్కరోజే సెలవు వచ్చింది. గురువారం దీపావళి పండుగ ఒక్కరోజే సెలవు.
ఇది కూడా చదవండి: రేవంత్ దూకుడు.. బడ్జెట్లో వెయ్యికోట్లు..మూసీ కాంట్రాక్టు పొంగులేటికే?
సీఎం ఉత్తర్వులు జారీ
ఆ తర్వాత శుక్రవారం పనిదినం కావడంతో మళ్లీ ఇంటిని వదిలి వెళ్లాలంటే చాలా మంది సతమతం అయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనిని గ్రహించిన తమిళనాడు సీఎం స్టాలిన్ శుక్రవారం (నవంబర్ 1)న కూడా సెలవు రోజుగా ప్రకటిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పండుగకు వరుసగా నాలుగు రోజులు సెలవులు లభించాయి.
Also Read: కరీంనగర్‌లో ఈఎస్ఐ హాస్పిటల్.. బండి విజ్ఞప్తికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
వరుసగా నాలుగు రోజులు
గురు, శుక్రవారం సెలవులతో పాటు శని, ఆదివారాలు కలిసి వచ్చాయి. దీంతో చాలా మంది తమ స్వస్థలాలకు వెళ్లి పండుగను జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి ప్రకటించినట్లు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు శుక్రవారం సెలవు ప్రకటిస్తే ఇక్కడ కూడా నాలుగు రోజులు సెలవులు వచ్చే అవకాశం ఉంది.