మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. నవంబర్ 20న అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. శివసేన, ఎన్సీపీ.. ఈ రెండు పార్టీలు కూడా రెండు వర్గాలుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే మహారాష్ట్రలో మహాయుతి కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరూ అనేదానిపై బీజేపీ కీలక నేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవిస్ ఓ హింట్ ఇచ్చారు. మా ముఖ్యమంత్రి ఇక్కడే కూర్చున్నారని అన్నారు. బుధవారం ముంబయిలో ఎన్డీయే ప్రభుత్వ రిపోర్టు కార్డును విడుదల చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ సంయుక్తంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
Also Read: కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్!
వీళ్లలోనే ఒకరు సీఎం
ఆయన వ్యాఖ్యలను బట్టి శివసేనకు చెందిన వ్యక్తే తమ కూటమి తరఫున సీఎం అయ్యే ఛాన్స్ ఉందని స్పష్టంగా చెప్పారు. అయితే అక్కడ ఏక్‌నాథ్ షిండే, అలాగే అజిత్ పవార్ ఉండటంతో ఉండటంతో వాళ్లిద్దరిలో ఎవరో ఒకరు సీఎం అయ్యే అవకాశాలున్నాయని ప్రచారాలు నడుస్తున్నాయి. మరోవైపు ఫడ్నవిస్ మాట్లాడుతూ దమ్ముంటే మహా వికాస్ అఘాడీ (MVA) కూటమి.. సీఎం అభ్యర్థిని ప్రకటించాలంటూ ఎన్సీపీ (శరద్‌పవార్) పార్టీ చీఫ్ శరద్ పవార్‌కు సవాలు విసిరారు.
Also Read: కొత్తగా పెళ్లయిందా? ఈ మూడు పాటిస్తే మీ భార్య మిమల్ని ఎప్పటికీ వదలదు!
మహా వికాస్ అఘాడీ సీఎం అభ్యర్థిని ప్రకటించాలి
'' మా ముఖ్యమంత్రి ఇక్కడే ఉన్నారు. ఎంవీఏ సీఎం అభ్యర్థిని ప్రకటించడం లేదు. ఎందుకంటే వాళ్లకు గెలుస్తామన్నా నమ్మకం లేదు. శరాద్‌పవార్‌కు సవాల్ విసురుతున్నాను. మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి సీఎం అభ్యర్థిని ప్రకటించండని'' ఫడ్నివిస్ అన్నారు. మరోవైపు ఎన్డీయే కూటమిలో ఉన్న ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు.
Also Read: రైతులకు మోదీ సర్కార్ అదిరిపోయే దీపావళి గిఫ్ట్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు!
ఇదిలాఉండగా.. మహా వికాస్ అఘాడిలో ఎన్‌సీపి (శరద్ పవార్), శివసేన (యూబీటీ) అలాగే కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. ఇక ఎన్డీయేలో ఎన్సీపీ (అజిత్ పవార్), శివసేన (ఏక్‌నాథ్ షిండే), బీజేపీ ఉన్నాయి. 2022లో శివసేన చీలిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి సీఎం ఉద్దవ్ థాక్రేకు వ్యతిరేకంగా ఏక్‌నాథ్ షిండే వర్గం ఒకటయ్యింది. దీంతో ఉద్దవ్ థాక్రే స్థానంలో ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు 2023లో కూడా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా చీలిపోయిన సంగతి తెలసిందే. ఎన్సీ (శరద్‌పవార్) ఓవైపు, మరోవైపు ఎన్సీ (అజిత్ పవార్) మరోవైపు ఇలా రెండుగా విడిపోయాయి.
Also Read: ఖగోళ అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు రాదు!
నవంబర్ 20న ఒకేదశలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈసారి మహారాష్ట్రలో ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు జార్ఖండ్‌లో కూడా నవంబర్ 13, 20న రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 23న ఈ రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ఉంటుంది.