అలెర్ట్.. వాతావరణంలో మార్పులు, 150కి పైగా విమాన సర్వీసులు రద్దు

ఉత్తర భారత్‌లో వాతావరణం మారిపోయింది. పూర్తిగా పొగమంచు కప్పేయడంతో శుక్రవారం 100 మీటర్ల దూరంలో ఉండే వాహనాలు సైతం కనిపించకుండా పోయాయి. దీంతో ఢిల్లీ వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

New Update
Dense fog blankets North India, 150 Flights Cancelled

Dense fog blankets North India, 150 Flights Cancelled

ఉత్తర భారత్‌లో వాతావరణం మారిపోయింది. పూర్తిగా పొగమంచు కప్పేయడంతో శుక్రవారం 100 మీటర్ల దూరంలో ఉండే వాహనాలు సైతం కనిపించకుండా పోయాయి. దీంతో ఢిల్లీ వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రోడ్డు, రైలు, వాయుమార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే 150కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరో 200 వరకు సర్వీసులు ఆలస్యమయ్యాయి. 

Also Read: ఆంధ్రాతీరం భారత్‌కు బంగారు గని.. దేశ భవిష్యత్ అంతా ఇక్కడే!

పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలను దట్టంగా పొగమంచు కప్పేసినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. శాటిలైట్‌ ఇమేజ్‌ల ద్వారా దీన్ని గుర్తించినట్లు చెప్పారు. ఉదయం 5.30 గంటలకు యూపీలోని ఆగ్రా, బరేలీ, గోరఖ్‌పుర్‌, షహరాన్‌పుర్‌, పంజాబ్‌లోని అమృత్‌సర్, లూథియానా, ఆందపుర్ అలాగే ఢిల్లీ, బిహార్‌, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఎదురుగా వస్తున్న వాహనాలు కనపించడం లేదు. 

Also Read: భారతీయ శరణార్థులకు బిగ్ షాక్.. వెనక్కి పంపించేస్తున్న యూరప్

మరోవైపు వాయు కాలుష్యాన్ని కంట్రోల్ చేయడం కోసం ఢిల్లీ ప్రభుత్వం కఠినంగా రూల్స్ అమలు చేస్తోంది. కాలుష్య నియంత్రణ ధ్రువపత్రం (PUC) లేని వాహనాలకు పెట్రోల్ అందించడం ఆపేశారు. ఈ రూల్స్‌ను కఠినంగా అమలు చేసేందుకు ఢిల్లీ సరిహద్దుల వద్ద పోలీసులు, రవాణాశాఖ బృందాలను మోహరించారు. ఎవరైన అక్రమంగా పీయూసీ లేని వాహనాలు నడిపిస్తే వాళ్లపై చర్యలు తీసుకుంటున్నారు. 

Advertisment
తాజా కథనాలు