Delhi Exit Polls: ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ విడుదల.. గెలుపు ఆ పార్టీదే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 70 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌ విడుదలయ్యాయి. 

New Update
Delhi Elections Exit Polls 2025

Delhi Elections Exit Polls 2025

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 70 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌ విడుదలయ్యాయి. మాట్రిజ్ సంస్థ తన సర్వేలో ఆప్‌కు 32-37, బీజేపీకి 35-40, కాంగ్రెస్‌కు 1 సీటు వస్తుందని వెల్లడించింది. 

పీ మార్క్

పీ మార్క్ సంస్థ తన సర్వేలో బీజేపీకి అధికారం వస్తుందని తేల్చిచెప్పింది. బీజేపీకి 39-49 సీట్లు, ఆప్‌కు కేవలం 21 నుంచి 31 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

ఆప్: 21-31
బీజేపీ: 39-49
కాంగ్రెస్‌: 0-1

పీపుల్ పల్స్

ప్రముఖ పోల్‌ సర్వే పీపుల్ పల్స్‌ బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చింది. బీజేపీ 51-60 స్థానాల్లో గెలవనుందని, ఆప్‌ 10 నుంచి 19 స్థానాలకు మాత్రమే పరిమతం కానుందని చెప్పేసింది. 

ఆప్‌: 10-19
బీజేపీ: 51-60
కాంగ్రెస్: 0 

పీపుల్స్‌ ఇన్‌సైట్ 

పీపుల్స్ ఇన్‌సైట్‌ సంస్థ హంగ్ వస్తున్నట్లు అంచనా వేసింది. అధికారంలోకి రావాలంటే 36 సీట్లు మేజిక్ ఫిగర్ కాగా.. ఆప్‌కు 25 -39 సీట్లు వస్తాయని చెప్పింది. ఇక బీజేపీకి 40-44 సీట్లు వస్తాయని తెలిపింది. 

ఆప్: 25-39
బీజేపీ: 40-44
కాంగ్రెస్‌: 0-2

జేవీసీ

జేవీసీ తన సర్వేలో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. బీజేపీ 39-45, ఆప్‌ 22-31 స్థానాల్లో గెలవనున్నట్లు అంచనా వేసింది. 

ఆప్: 22-31
బీజేపీ: 39-45
కాంగ్రెస్‌: 0-2 

చాణక్య స్ట్రాటజీస్ 

చాణక్య స్ట్రాటజీస్ బీజేపీ గెలుస్తుందని చెప్పింది. ఆప్‌ 25-28, బీజేపీ 39-44 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. 

ఆప్: 25-28
బీజేపీ: 39-44
కాంగ్రెస్: 2-3 

పోల్‌ డైరీ

పోల్‌ డైరీ బీజేపీకి స్పష్టమైన మెజార్టీ ఇచ్చింది. బీజేపీ 42-50 స్థానాల్లో గెలుస్తుందని, ఆప్ 18 నుంచి 25 సీట్లకు మాత్రమే పరిమతం అవుతున్నట్లు అంచనా వేసింది. 

ఆప్: 18-25
బీజేపీ: 42-50
కాంగ్రెస్: 0-2 

వీప్రెసీడ్‌

వీప్రెసీడ్ సంస్థ.. తన సర్వేలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని అంచనా వేసింది. ఆప్‌కు 46-52 సీట్లు, బీజేపీకి 18 -23 సీట్లు వస్తాయని చెప్పింది.

ఆప్: 46-52
బీజేపీ: 18-23
కాంగ్రెస్: 0-1

టైమ్స్ నౌ 

టైమ్స్‌ నౌ  ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్య టఫ్‌ ఫైట్ ఉండనున్నట్లు తెలిపింది. ఆప్‌ 27 - 34, బీజేపీ 37- 43 స్థానాల్లో గెలుస్తుందని తమ సర్వేలో అంచనా వేసింది. ఈ లెక్కలు చూస్తే హంగ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది

ఆప్: 27-34
బీజేపీ: 37-43
కాంగ్రెస్: 0-2

డీవీ రీసెర్చ్ 

డీవీ రీసెర్చ్‌ సంస్థ కూడా ఆప్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉండనున్నట్లు చూపించింది. ఆప్‌ 26-34, బీజేపీ 36-44 స్థానాల్లో గెలవనున్నట్లు తమ సర్వేలో అంచనా వేసింది. దీని లెక్కలు కూడా చూస్తే హంగ్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు. 

ఆప్: 26-34
బీజేపీ: 36-44
కాంగ్రెస్: 0 

ఆపరేషన్ చాణక్య

ఆపరేషన్ చాణక్య బీజేపీ అధికారంలోకి వస్తుందని తమ సర్వేలో అంచనా వేసింది. ఆప్‌ 22-25 సీట్లు వస్తాయని, బీజేపీ 33-37 స్థానాల్లో గెలుస్తుందని తెలిపింది.

ఆప్‌: 22-25
బీజేపీ: 33-37
కాంగ్రెస్: 6-7
ఇతరులు: 0-1 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు