దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ కాలుష్యం పెరిగిపోతుంది. గాలిలో వాయు నాణ్యత సూచీ 400కి పైగానే నమోదవుతుంది. ఇప్పటికే ఢిల్లీలో పలు ఆంక్షలు పెట్టారు. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ప్రైవేట్ ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగస్తుల పనివేళల్లో కూడా మార్పులు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చూడండి: షమీ-మంజ్రేకర్ మధ్య ఐపీఎల్ వివాదం.. దాన్ని దాచుకోమంటూ కౌంటర్స్!
పూల్ వెహికల్ విధానాన్ని అనుసరించాలని..
కాలుష్యం కారణంగా ఉద్యోగులు షిఫ్ట్‌లలో పనిచేయడానికి వెసులుబాటు కల్పించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందులు షిఫ్టుల్లో పూల్ వెహికల్ విధానాన్ని అనుసరించాలని తెలిపింది. సొంత వాహనాలు కంటే ప్రజా రవాణాను ఉపయోగించాలని తెలిపింది. దీనివల్ల కొంత వరకు కాలుష్యాన్ని అరికట్టవచ్చని భావించింది.
ఇది కూడా చూడండి: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్ వైరల్!
ఢిల్లీ మున్సిపాలిటీ పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8.30 నుంచి 5 గంటల వరకు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 వరకు, దిల్లీ ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనిచేయాలని సీఎం అతిశీ ఆదేశించారు.
ఇది కూడా చూడండి: బద్దశత్రువుకు కీలక పదవి ఇచ్చిన చంద్రబాబు.. వ్యూహం అదేనా?
ఇదిలా ఉండగా.. ఇప్పటికే కూల్చివేతలు, నిర్మాణ పనులను ఆపివేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే అవసరం లేని భారీ వాహనాలను కూడా సిటీలో నిషేధం విధించారు. కొన్ని ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచీ 1000 కంటే ఎక్కువగా ఉంది. అధిక కాలుష్యం వల్ల ఢిల్లీ ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఇది కూడా చూడండి: AR Rahman : అసిస్టెంట్ తో రెహమాన్ ఎఫైర్.. అందుకే విడాకులు..?