Air Pollution: పొల్యూషన్ పీక్స్.. అనారోగ్య సమస్యలతో 69 శాతం కుటుంబాలు దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. దీంతో 69 శాతం కుటుంబాల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఇటీవల ఓ సర్వే తెలిపింది. ముఖ్యంగా గొంతు నొప్పి, ముక్కు, జలుబు, ఆస్తమా వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. By Kusuma 02 Nov 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ పీక్స్‌కి చేరింది. సాధారణంగానే ఢిల్లో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు దీపావళి పండుగ నేపథ్యంలో కాలుష్యం ఇంకా పెరిగింది. ఢిల్లీలోని చాలా ప్రదేశాల్లో ఎయిర్ క్వాలిటీ లేదు. దీపావళి కారణంతో గాలిలో నాణ్యత 362 పాయింట్లు నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో అయితే 400 పాయింట్లకు పైగా కూడా చేరింది. ఇది కూడా చూడండి: కార్తీక మాసంలో ఈ పనులు చేస్తే.. దరిద్ర మంతా మీ ఇంట్లోనే.. చాలా కుటుంబాలు అనారోగ్య సమస్యలతో.. ఇంత ఎక్కువ మొత్తంలో పొల్యూషన్ ఆరోగ్యానికి హానికరం. అయితే ఈ పొల్యూషన్ వల్ల ఢిల్లోలోని 69 శాతం కుటుంబాల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఇటీవల ఓ సర్వే తెలిపింది. 62 శాతం కుటుంబాల్లో గొంతు నొప్పి, ముక్కు, జలుబు వంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. మరికొందరు ఆస్తమాతో పాటు శ్వాస తీసుకోవడంలో సమస్యలు, తలనొప్పి, యాంగ్జయిటీ, నిద్రలేమి వంటి వాటితో బాధపడుతున్నారు. ఇది కూడా చూడండి: Vaishnavi Chaithanya: దీపాల వెలుగులో బేబీ బ్యూటీ.. ఎంత అందంగా ఉందో..! ఆర్కేపురం, అశోక్ విహార్, మందిర్ మార్గ్, ఎయిర్‌పోర్టు, రోహిణీ, జహంగీర్‌పుర్‌తో పాటు నొయిడా, గాజియాబాద్, గురుగ్రామ్‌లోనూ సూచీ 350పైనే ఉంది. మహారాష్ట్రలోని ఇందౌర్‌లో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోవడంతో పాటు పశ్చిమబెంగాల్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా గాలి నాణ్యత క్షీణించింది. ఇది కూడా చూడండి: Health Benefits: ఉదయాన్నే ఈ జావ తాగితే.. అనారోగ్య సమస్యలన్నీ మటాష్ ఢిల్లీలో అధిక పొల్యూషన్ కారణంగా చాలా మంది వేరే ప్రదేశానికి మారుతున్నారు. కొందరు వాటి నుంచి తప్పించుకోవడానికి ఎయిర్ ఫ్యూరిఫయర్లు కూడా వాడుతున్నారు. కొన్ని కుటుంబాలు ఆ పొల్యూషన్‌లోనే జీవిస్తున్నారు. మరికొందరు ఆహార నియమాలు పాటిస్తే అదే కాలుష్యంలో జీవనం సాగిస్తున్నారు. ఇది కూడా చూడండి: Spain Floods: స్పెయిన్ వరద బీభత్సం.. 205కి చేరిన మృతుల సంఖ్య #rtv #delhi-pollution #air-pollution మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి