జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టకూడదు: సుప్రీంకోర్టు

ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు రాస్తే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలా చేయడం వల్ల భావా ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే అని తెలిపింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

Supreme Court 3
New Update

ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తలు రాసే జర్నలిస్టులపై కొందరు క్రిమినల్ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తుంటారు. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు రాస్తే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని పేర్కొంది. ఇలా చేయడం వల్ల భావా ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే అని తెలిపింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఓ జర్నలిస్టు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగానే సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆ జర్నలిస్టుకు మధ్యంతర రక్షణ కల్పించింది.   

Also Read: పాకిస్థాన్‌కు వెళ్లనున్న ఎస్. జైశంకర్‌.. ఎందుకో తెలుసా ?

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అభిషేక్ ఉపాధ్యాయ్ అనే జర్నలిస్ట్ ప్రభుత్వ పాలనా విభాగంలో కుల సమీకరణలకు సంబంధించి ఓ కథనం రాశారు. ఈ వ్యవహారంపై యూపీ పోలీసులతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. వీటిని కొట్టివేయాలని కోరుతూ అభిషేక్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం.. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కథనాలు రాసినంత మాత్రాన జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టకూడదని వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్య దేశాల్లో భావవ్యక్తీకరణ స్వే్చ్ఛను గౌరవించాలని చెప్పింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) జర్నలిస్టుల హక్కులకు రక్షణ ఉంటుందని తెలిపింది. కేవలం జర్నలిస్టులు రాసిన కథనాలను విమర్శలుగా భావించి.. వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టకూడదని పేర్కొంది. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీం ధర్మాసనం.. తదుపరి విచారణను నవంబర్ 5కు వాయిదా వేసింది. 

#telugu-news #national #supreme-court
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe