Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆమెపై కేసు నమోదు చేయాలని బెంగళూరులోని తిలక్‌నగర ఠాణా పోలీసులను చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. బీజేపీని నిధుల కొరకు ఆమె పలువురు బడా వ్యాపారవేత్తలను బెదిరించి.. వారి నుంచి భారీ మొత్తంలో నగదును ఎలక్టోరల్ బాండ్ల పేరిట బీజేపీ పార్టీ అకౌంట్ కు బదిలీ చేశారని జనాధికార సంఘర్ష పరిషత్తుకు చెందిన ఆదర్శ్ అయ్యర్ ఆరోపణలు చేస్తూ గతంలో తిలక్‌నగర ఠాణాలో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు.
పోలీసులు పట్టించుకోలేదు..
ఆమెపై కేసు నమోదు చేయాలని కోరారు. అతను ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేరు. నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. పోలీసులు తాను ఇచ్చిన ఫిర్యాదు తీసుకోకపోవడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై నిన్న విచారణ పూర్తి చేసిన న్యాయమూర్తి సంతోశ్ గజానన హెగ్డే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించి, తదుపరి విచారణను అక్టోబరు 10కి వాయిదా వేశారు. కాగా కోర్టు ఆదేశాలతోనైనా పోలీసులు నిర్మలా సీతారామన్ పై కేసు నమోదు చేస్తారో లేదో వేచి చూడాలి.
Also Read: నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము