Corona : భారత్‌లో వెయ్యిదాటిన కరోనా యాక్టివ్ కేసులు

భారత్‌లో కరోనా మరోసారి విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మళ్లీ కరోనా మరణాలు మొదలయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందినట్లు వైద్య ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్‌ కేసులు ఇప్పటికే వెయ్యి దాటాయి.

New Update
WHO: కరోనా మహమ్మారి ఎఫెక్ట్.. తగ్గిన ఆయుర్దాయం.!

Corona

Corona : ప్రపంచాన్ని భయపెట్టిన కరోనా మరోసారి భారత్‌లో విజృంభిస్తోంది. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మళ్లీ కరోనా మరణాలు మొదలయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందినట్లు ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్‌ కేసులు ఇప్పటికే వెయ్యి దాటాయి. దేశ రాజధానిలో కరోనా కేసుల సంఖ్య వందకు చేరింది. అదే సమయంలో తెలుగు రాష్ర్టాల్లో ముగ్గురికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు.

ఇది కూడా చూడండి:Sheikh Hasina: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పుంజుకుంటున్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీని కరోనా వణికిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ వందమందికి పైగా వైరస్‌ బాధితులను ఇంట్లో క్వారంటైన్‌ చేసినట్లు వైద్యులు వెల్లడించారు.-- కేరళ, మహారాష్ట్రలో కరోనా డేంజర్ బెల్స్‌మోగిస్తోంది. ఇక్కడ 430 కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య, ఆరోగ్య శాఖాధికారులు అప్రమత్తమయ్యారు. దానితో పాటు మహారాష్ర్టలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.209 యాక్టివ్ కేసులు ఆ రాష్ట్రంలో నమోదయ్యాయి. వీటితో పాటు ఢిల్లీ 104, గుజరాత్‌లో 83,  ఉత్తరప్రదేశ్ లో 15, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో 12 కేసులు, కర్ణాటకలో 57 మందికి పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.

ఇది కూడా చూడండి:BIG BREAKING: సంచలన అప్‌డేట్‌.. పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ బాంబు దాడి

గడచిన వారం రోజులుగా కరోనా చాపకిందనీరులా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇక కరోనాతో దేశవ్యాప్తంగా కరోనాతో నలుగురు మరణించినట్లు వైద్యారోగ్య వర్గాలు తెలిపాయి.  మహారాష్ట్రలో ఒకరు, కేరళలో ఇద్దరు,, కర్ణాటకలో ఒకరు కోవిడ్ వైరస్ మూలంగా చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా టీకాలు వేసినందున బయపడాల్సిన అవసరం లేదని, కాకపోతే అనారోగ్యంతో బాధపడే వారికి కరోనా తొందరగా ఎటాక్‌ అయ్యే అవకాశం ఉంటుంది. కనుక వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇది కూడా చూడండి:BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

Advertisment
తాజా కథనాలు