బిగ్ షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

రెస్టారెంట్లలో ఎక్కువగా వాడే 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.16.5 పెంచుతున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే నేటి నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయి.

New Update
Gas rates:మళ్ళీ పెరిగిన గ్యాస్ ధరలు

ప్రతీ నెలా చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను మారుస్తుంటుంది. ఈ క్రమంలో నేడు గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. రెస్టారెంట్లు, హెటల్స్‌లో ఎక్కువగా వాడే 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.16.5 పెంచుతున్నట్లు తెలిపింది. 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

ఇది కూడా చూడండి: Fengal Cyclone : తీరాన్ని తాకిన తుపాను..జిల్లాలకు అధికారుల హెచ్చరికలు

ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

ప్రస్తుతం హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.2044 ఉండగా, డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.855గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1819 ఉండగా, కోల్‌కతాలో రూ.1927, ముంబైలో రూ.1771, చెన్నైలో రూ.1980 ఉంది. అయితే కమర్షియల్ గ్యాస్‌ సిలిండర్ ధరలు పెరగడం వరుసగా ఇది ఐదోసారి. నేటి నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయి.

ఇది కూడా చూడండి: BIG BREAKING: తెలంగాణలో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు..

వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ కంపెనీలు పెంచాయి. కానీ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో అయితే ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ గ్యాస్ సిలిండర్ ధరలు ప్రాంతాన్ని  బట్టి మారుతాయి. 14.2 కేజీల సిలిండర్ ధర ఢిల్లీలో రూ.803 ఉండగా, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50 ఉంది. 

ఇది కూడా చూడండి: Adani: దాడులు మరింత బలాన్ని ఇస్తాయి..గౌతమ్ అదానీ

ప్రతినెల గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు వస్తుంటాయి. ఆగస్టు నుంచి ప్రతీ నెలా కూడా సిలిండర్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత ఐదు నెలలుగా చూసుకుంటే ఒక్కో కమర్షియల్ సిలిండర్ ధరపై రూ.173 పెరిగింది. కానీ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌లో మాత్రం చమురు కంపెనీలో ఎలాంటి మార్పులు కూడా చేయలేదు. 

ఇది కూడా చూడండి: ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవే..?

Advertisment
తాజా కథనాలు