DMK: కోయంబత్తూరు గ్యాంగ్‌రేప్‌ ..  బాధితురాలిపై DMK ఎమ్మెల్యే సంచలన కామెంట్స్

కోయంబత్తూర్‌లో ఇటీవల కళాశాల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై అధికార డీఎంకే కూటమిలోని మిత్రపక్ష ఎమ్మెల్యే ఈశ్వరన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

New Update
BJP

DMK: కోయంబత్తూర్‌లో ఇటీవలకళాశాల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై అధికార డీఎంకే కూటమిలోని మిత్రపక్ష ఎమ్మెల్యే ఈశ్వరన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

కోయంబత్తూర్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఈ దారుణ ఘటన నేపథ్యంలోఈశ్వరన్  పరోక్షంగా బాధితురాలిని నిందించేలా వ్యాఖ్యలు చేశారు. రాత్రి సమయంలో ఆ ప్రాంతంలో విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి కారులో కూర్చుని మాట్లాడుకోవడం అవసరమా అన్న రీతిలో ఆయన ప్రశ్నించారు. బాధితురాలిపై కాకుండా, ఆమె బయటకు వెళ్లిన సమయం, ప్రదేశంపై దృష్టి సారించే ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.

నేపథ్యంలోఈశ్వరన్  చేసిన ఈ వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్రంగా ఖండించింది. బీజేపీ నేత కె. అన్నామలై సహా పలువురు నాయకులు స్పందిస్తూ, బాధితురాలిని నిందించడం సరికాదని, ఈ వ్యాఖ్యలు అమానుషమని పేర్కొన్నారు. మహిళల భద్రత కల్పించడంలో అధికార డీఎంకే ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని ఆరోపించారు. బాధితురాలి దుస్థితిపై సానుభూతి చూపకుండా, ఆమెపై తప్పు మోపే ప్రయత్నం చేయడం దారుణమని విమర్శించారు.

ముగ్గురు నిందితులు అరెస్ట్

మరోవైపు ఈ కేసులో పోలీసులు వేగంగా స్పందించి, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునే క్రమంలో వారు తప్పించుకోవడానికి ప్రయత్నించగా, పోలీసులు వారి కాళ్ళపై కాల్పులు జరిపి పట్టుకున్నారు. నిందితులు గుణ, కరుప్పసామి, కార్తీక్ అలియాస్ కాలీశ్వరన్‌లను అరెస్ట్ చేసి, వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలు, పలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కూడా ఈ ఘటనను ఖండించి, నిందితులకు గరిష్ట శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Advertisment
తాజా కథనాలు