PM Internship Program: యువతకు కేంద్రం బంపర్‌ ఆఫర్‌..ఇక నెలకు రూ.11,800

ఈ ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ లో కేంద్ర ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా యువతకోసం పలు సంస్కరణలు తీసుకురానుంది. పీఎం ఇంటర్న్‌షిప్ పథకం స్టైఫండ్ నురూ.5 వేల నుంచి రూ.11,800లకు పెంచుతారని సమాచారం.  

New Update
PM Internship Program Scheme

PM Internship Program

PM Internship Program: ఈ ఏడాది ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ లో కేంద్ర ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా యువతకోసం పలు సంస్కరణలు తీసుకురానుంది. ఇప్పటికే దేశంలోని యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా పీఎం ఇంటర్న్‌షిప్ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసింది. దీని ద్వారా నెలకు రూ.5 వేల స్టైఫండ్, ఏడాది పాటు శిక్షణ సహా పలు బెనిఫిట్స్ కల్పిస్తోంది. అయితే ఈ ఏడాది బడ్జెట్‌లో పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్‌లో కీలక మార్పులు తేనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్టైఫండ్ రూ.11,800లకు పెంచుతారని సమాచారం.  
 
  యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2024-25లో పైలట్ ప్రాజెక్ట్ గా పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా ఏడాది పాటు ఉచిత శిక్షణ ఇవ్వడమే కాకుండా ఒక్కో అభ్యర్థికి రూ.60 వేల స్టైఫండ్ అందిస్తోంది.  దీనిద్వారా కోటి మందిని నైపుణ్యవంతులగా తీర్చిదిద్ది వారికి ఉద్యోగావకాశాలు మెరుగుపరచడమే ఈ పథకం లక్ష్యం. దీన్ని మరింత విస్తరించాలని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో వార్షిక బడ్జెట్ 2026-27లో పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో కీలక మార్పులు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.  

Also Read: ఏం గుండెరా వాడిది..! ఏనుగును దత్తత తీసుకున్న సూపర్‌స్టార్ శివకార్తికేయన్.

కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాల ప్రకారం ప్రస్తుతం పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ ద్వారా నెలకు రూ.5000 అందిస్తున్న స్టైఫండ్‌ని రూ.11,800లకు పెంచాలని కేంద్రం భావిస్తుంది. మార్చి 2026 నుంచి ఈ పెంపు ఉండేలా బడ్జెట్‌లో ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. యువత నుంచి అనుకున్నంత స్థాయిలో ఆదరణ లభించకపోవడానికి ప్రధాన కారణం తక్కువ స్టైఫండ్ అని కేంద్రం భావించి దానిని పెంచాలనుకుంటుంది. 2024, అక్టోబర్‌లో ప్రారంభమైన ఈ పీఎంఐఎస్ స్కీమ్ రెండు విడతల శిక్షణ పూర్తి చేసుకుంది. అయితే, యువత నుంచి పెద్దగా స్పందన రాకపోవడం, చేరిన వారు సైతం మధ్యలోనే ఆపేయడం వంటివి జరుగుతున్నాయని గుర్తించారు. దీనితో యువతను పెద్ద సంఖ్యలో ఆకర్షించేందుకు స్టైఫండ్ పెంచాలని కేంద్రం నిర్ణయించినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.

Also Read: ‘స్లమ్ డాగ్ - 33 టెంపుల్ రోడ్’ నుంచి దునియా విజయ్ లుక్ రిలీజ్!

అలాగే ప్రస్తుతం పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో 549 కంపెనీల్లో యువతకు శిక్షణ ఇస్తున్నారు. అయితే, ఈ కంపెనీల సంఖ్యను 6000లకు పెంచాలనే ప్రతిపాదన కూడా ఉంది. దీనిలో గత మూడేళ్లలో సగటు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఎక్కువ ఖర్చు చేసిన టాప్ 500 కంపెనీలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. వాటికి అదనంగా 49 కంపెనీలను పర్యాటకం, ఆతిథ్యం, ఆరోగ్య రంగాల నుంచి ఎంపిక చేశారు. ఇప్పుడు మూడో విడతకు ఈ సంఖ్యను ఏకంగా ఆరు వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. సీఎస్ఆర్ కార్యకలాపాల కోసం ఎంసీఏ కింద రిజిస్టర్ అయిన అన్ని కంపెనీలను ఈ స్కీమ్ కిందకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందులో దాదాపు 2000 కంపెనీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్టయ్యాయి.

Also Read: క్రేజీ బజ్.. 'ధురంధర్ 2'కు ఆ హిట్ సినిమాతో లింక్..?

వీటికి సంబంధించి బడ్జెట్ 2026లో ప్రకటన చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అలాగే వయో పరిమితిని సైతం 18 నుంచి 30 ఏళ్లకు పెంచాలనే ఆలోచనలో ఉన్నారని కూడా తెలుస్తోంది. ప్రధానంగా పాలిటెక్నిక్, డిప్లమా, ఐటీఐల నుంచి వచ్చే యువతకు అధిక అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో చేరేందుకు వయసు 21- 24 మాత్రమే. ఈ స్కీమ్‌లో 12 నెలల పాటు ఉచిత శిక్షణ ఇస్తారు. శిక్షణ ముగించుకున్న తర్వాత అదనంగా రూ.6 వేలు స్టైఫండ్ అందిస్తారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ.66 వేల స్టైఫండ్ లభిస్తుంది. బడ్జెట్‌లో స్టైఫండ్‌ పెరిగితే అది రూ.1,41,600 లకు చేరుకుంటుంది.

Advertisment
తాజా కథనాలు