రూ.1200 కోట్ల స్కామ్‌ దర్యాప్తులో కుట్ర.. ఐపీఎస్ అధికారిణి అరెస్టు

మహారాష్ట్రలో రూ.1200 కోట్ల స్కామ్‌కు సంబంధించిన విచారణలో ఐపీఎస్ అధికారిణి భాగ్యశ్రీ నవ్‌టకే ఫోర్జరీ, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు తేలింది. దీంతో ఆమెపై సీబీఐ కేసు నమోదు చేసింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.

New Update
police


మహారాష్ట్రలోని ఓ భారీ కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తులో కుట్ర బయటపడటం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఓ మహిళా ఐపీఎస్ అధికారిపై సీబీఐ కేసు నమోదు చేసింది. మొత్తం రూ.1200 కోట్ల స్కామ్‌కు సంబంధించిన విచారణలో ఆమె ఫోర్జరీ, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు తేలింది. తాజాగా ఈ విషయాన్ని సీబీఐ వెల్లడించింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

Also read: కులగణనకు రంగం సిద్ధం.. 10-15 రోజుల్లోనే పూర్తి

దర్యాప్తులో ఉన్నప్పుడే 

ఇక వివరాల్లోకి వెళ్తే.. జల్‌గావ్‌ జిల్లాలోని భైచంద్ హీరాచంద్ రైసోనీ క్రెడిట్ సొసైటీ.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల పేరుతో ఎంతోమందిని మోసం చేసింది. రూ.1200 కోట్లకు పైగా ఈ స్కామ్‌ చేసింది. 2015లో ఈ కుంభకోణం బయటపడింది. 2020లో ఈ కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. దీనికి సంబంధించిన కేసులను దర్యాప్తు చేసిన సిట్‌కు ఐపీఎస్‌ అధికారిణి భాగ్యశ్రీ నవ్‌టకే నేతృత్వం వహించారు. ఈ కేసు దర్యాప్తులో ఉన్నప్పుడే ఆమె ఎన్నో అవకతవకలకు పాల్పడినట్లు సీబీఐ వెల్లడించింది.  

Also read: టీడీపీ నేత రాసలీలలు.. రాత్రికి వస్తేనే పింఛన్లు, ఇంటి స్థలాలు

జైల్లో ప్రధాన నిందితుడు 

ఒకేరోజున ఒక్క నేరం కింద మూడు కేసులు నమోదు చేసి.. కేసు కోసం హాజరుకాకుండానే ఫిర్యాదుదారుల సంతకాలను ఫోర్జరీ చేయడంలో ఆమె ప్రమేయం ఉన్నట్లు సీబీఐ విచారణలో బయటపడింది. భాగ్యశ్రీ నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు సీబీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆమెపై కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి కంపెనీ డైరెక్టర్లపై 2020లోనే సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఏడాది ప్రధాన నిందితుడు జితేంద్ర కందారేను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిపై కూడా దర్యాప్తు జరుగుతోంది.  

Also read: న్యాయం గుడ్డిది కాదు.. చట్టానికీ కళ్లున్నాయి.. సుప్రీంకోర్టులో కొత్త విగ్రహం!

Also read:సుప్రీం కోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా!

Advertisment
Advertisment
తాజా కథనాలు