BIG BREAKING : కేంద్రం గుడ్ న్యూస్.. 10 వేల మెడికల్ సీట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్!

దేశంలో వైద్య విద్యను మరింత బలోపేతం చేయడానికి, గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పీజీ, అండర్ గ్రాడ్యుయేట్ సీట్ల సామర్థ్యాన్ని పెంచడానికి ఆమోదం లభించింది. 

New Update
medical

దేశంలో వైద్య విద్యను మరింత బలోపేతం చేయడానికి, గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ), అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ/ఎంబీబీఎస్) సీట్ల సామర్థ్యాన్ని పెంచడానికి ఆమోదం లభించింది. 

కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం, దేశవ్యాప్తంగా మొత్తం 5,000 కొత్త పీజీ సీట్లను, 5,023 అదనపు ఎంబీబీఎస్ సీట్లను పెంచనున్నారు. ఈ పెంపుదల సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ (CSS) ఫేజ్-III కింద అమలు చేస్తారు. ఈ పథకం కింద ఒక్కో సీటుకు రూ. 1.50 కోట్ల వరకు నిధులు కేటాయించనున్నారు, దీని ద్వారా వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం, బోధనా సిబ్బందిని నియమించడం వంటివి జరుగుతాయి. ఈ పథకం కోసం 2025-26 నుండి 2028-29 వరకు రూ. 15,034.50 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ. 10,303.20 కోట్లు కాగా, రాష్ట్రాలు రూ. 4,731.30 కోట్లు భరిస్తాయి.

ఈ నిర్ణయం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.  వైద్య విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు భారత్ లోనే ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. దేశంలో వైద్యులు,  స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరుగుతుంది. గ్రామీణ,  వెనుకబడిన ప్రాంతాలలో నాణ్యమైన ఆరోగ్య సేవలు మెరుగుపడతాయి.వైద్యులు, ప్రొఫెసర్లు, పరిశోధకులు, పారామెడికల్ సిబ్బంది వంటి వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుక

మరోవైపు రైల్వే ఉద్యోగులకు దీపావళి కానుకను ప్రకటించింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌ ప్రకటించింది. బోనస్‌ కోసం రూ.1866 కోట్లు కేటాయించింది. దీంతో గ్రూప్‌-C, గ్రూప్‌-D కేటగిరీలో 10.61 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఇక రూ.95 వేల కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బోనస్ సాధారణంగా దసరా/దుర్గాపూజ పండుగలకు ముందు చెల్లిస్తారు. రైల్వే ఉద్యోగుల పనితీరు, ఉత్పాదకతను ప్రోత్సహించడానికి ఈ బోనస్ ఇస్తారు. అయితే, బోనస్ లెక్కింపునకు సంబంధించి 6వ వేతన సంఘం ప్రకారం రూ. 7000 ప్రాతిపదికన లెక్కించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. 7వ వేతన సంఘం ప్రకారం కనీస వేతనం రూ. 18,000గా ఉందని, దాని ఆధారంగా బోనస్ లెక్కించాలని డిమాండ్ చేశాయి. కానీ, ప్రభుత్వం మాత్రం పాత విధానాన్ని కొనసాగించింది.

Advertisment
తాజా కథనాలు