Supreme Court: కలెక్టర్లకు ఆ ఛాన్స్ ఇవ్వలేం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

గ్రామీణ ప్రజాస్వామ్యాన్ని నిరుత్సాహపరిచే అవకాశం బ్యూరోక్రాట్లకు ఇవ్వలేమని పేర్కొంది. మహారాష్ట్రలో ఓ గ్రామ సర్పంచ్‌పై కలెక్టర్‌ అనర్హత వేటు వేయడంతో దీన్ని సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Supreme Court

Supreme Court

సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. గ్రామీణ ప్రజాస్వామ్యాన్ని నిరుత్సాహపరిచే అవకాశం బ్యూరోక్రాట్లకు ఇవ్వలేమని పేర్కొంది. మహారాష్ట్రలో ఓ మహిళను గ్రామ సర్పంచిగా తిరిగి నియమిస్తూ బాంబే హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. పంచాయతీ ప్రతినిధులతో ఉన్నతాధికారులు అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలు ఇటీవల తమ దృష్టికి వచ్చాయని చెప్పింది.

Also Read: రన్యా రావు గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో మరో ట్విస్ట్.. కర్ణాటక సర్కార్‌ కీలక ఆదేశం  

'' ఉన్నతాధికారులు.. ప్రజాప్రతినిధులతో అనుచితంగా ప్రవర్తించిన రెండు, మూడు కేసుల్లో మేము తీర్పులు వెలవరించాం. మహారాష్ట్రలో ఇలా ఎక్కువగా జరుగుతోంది. ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనే అధికారులు ఉండాలి. గ్రామీణ స్థాయి ప్రజాస్వామ్యాన్ని నిరాశపరిచే ఛాన్స్ బ్యూరోక్రాట్లకు ఇవ్వకూడదని'' జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎన్‌ కోటీశ్వర్‌ సింగ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. పలు సందర్భాల్లో ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు వేసేందుకు పాత కేసులను బయటకి తీసేందుకు యత్నిస్తున్నట్లు గుర్తించామని పేర్కొంది. 

Also Read: సౌందర్యది హత్యే! చంపింది మోహన్ బాబే.. మంచు మోహన్‌ బాబుపై సంచలన ఫిర్యాదు

ఇదిలాఉండగా.. రాయ్‌గఢ్‌ జిల్లాలోని రోహా తాలుకా ఐంఘడ్‌ గ్రామ సర్పంచ్ కళావతి రాజేంద్రపై గతేడాది స్థానిక కలెక్టర్ అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం కొత్త సర్పంచ్‌ను ఎన్నుకునేందుకు రిటర్నింగ్ అధికారిని కూడా నియమించారు. దీనిపై బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కలెక్టర్‌ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని 2024, జులై 7న బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది. 

Also Read: ఆయుధాల దిగుమతిలో భారత్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో ఉక్రెయిన్ !

Also Read: పాక్‌లో ట్రైన్‌ హైజాక్.. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) డిమాండ్స్‌ ఏంటి?.. ఆ సంస్థ బ్యాగ్రౌండ్ ఏంటి?

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు