BREAKING : సుప్రీం కోర్టు నూతన CJIగా BR గవాయ్ పేరు

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ పేరును కొలిజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం చీఫ్ జస్టిస్ గా ఉన్న సంజీవ్ ఖన్నా మే 13న పదవి విరమణ పొందనున్నారు. ఆయన తర్వాత భూషణ్ రామకృష్ణ అత్యున్నత న్యాయ స్థానం చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు.

New Update
new CJI

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ పేరును కొలిజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం చీఫ్ జస్టిస్ గా ఉన్న సంజీవ్ ఖన్నా మే 13న పదవి విరమణ పొందనున్నారు. ఆయన తర్వాత భూషణ్ రామకృష్ణ అత్యున్నత న్యాయ స్థానం చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు. మే 14న తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  2019లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. సుప్రీంకోర్టకు రాకముందు ముంబై హైకోర్టు జడ్జిగా చాలాకాలం పని చేశారు. మహారాష్ట్రలోని అమరావతిలో గవాయ్ జన్మించారు. 64 ఏళ్ల జస్టిస్ బిఆర్ గవాయ్ నవంబర్ 2025 లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన సిజెఐ పదవీకాలం 2025 మే 14 నుంచి నవంబర్ 24 వరకు కొనసాగుతుంది.

ఈయన తండ్రి ఏఆర్ గవాయ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించారు. లోక్ సభ, రాజ్యసభలో ఎంపీగా కూడా ఉన్నారు. ఎమ్మెల్యే, బీహార్, కేరళా,సిక్కిం రాష్ట్రాల గవర్నర్ గా కూడా పని చేశారు. 

Advertisment
తాజా కథనాలు