CRPF Schools: దేశంలోని సీఆర్‌పీఎఫ్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. మెయిల్ ద్వారా బెదిరింపు సందేశాలు పంపారు కొందరు దుండగులు. ఇటీవలే ఢిల్లీ సీఆర్‌పీఎఫ్ స్కూల్ వద్ద పేలుడు చోటు చేసుకున్న నేపథ్యంలో భయాందోళనలు పరిస్థితులు నెలకొన్నాయి. నైట్రేట్ ఆధారిత పేలుడు పదార్థాలను తరగతి గదుల్లో అమర్చినట్లు మెయిల్‌లో దుండగులు పేర్కొన్నారు. వచ్చిన బాంబ్ బెదిరింపు మెయిల్స్ లో రెండు ఢిల్లీలోని CRPF స్కూళ్ళు.. అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్న CRPF స్కూళ్ళో బాంబ్ ఉందంటూ హెచ్చరికలు వచ్చాయి. కాగా ఈ బాంబ్ బెదిరింపు మెయిల్స్ అన్ని నిన్న అర్థరాత్రి వచ్చినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: వైసీపీ మాజీ ఎంపీ సత్యనారాయణకు బిగుస్తున్న ఈడీ ఉచ్చు
ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ మాజీ మంత్రి ఇంట్లో విషాదం!
ఆదివారం ఉదయం...
ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని CRPF పబ్లిక్ స్కూల్ బయట పేలుడు జరగడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పేలుడు కేసుని విచారించేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ (NIA) రంగంలోకి దిగింది. అయితే ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2 కిలోమీటర్ల వరకు ఈ పేలుడు శబ్ధం వినిపించినట్లు ప్రజలు చెబుతున్నారు. పేలుడు నుంచి వచ్చిన షాక్ వేవ్స్ వల్ల దగ్గర్లో ఉన్న భవనాలు, వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలంలో తెల్లటి పౌడర్ మిశ్రమాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త!
ఈ పౌడర్ శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ, ఎన్ఎస్‌జీ బృందాలు సేకరించాయని పేర్కొన్నారు. పేలుడు పదార్థాల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఉదయం 7.47 AM గంటలకు సీఆర్‌పీఎఫ్ స్కూల్ బయట మొదట పొగలు వచ్చి ఆ తర్వాత భారీ పేలుడు జరిగింది. బలమైన మెసేజ్ ఇచ్చేందుకే దుండగులు ఈ పేలుడికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇది టెర్రరిస్టుల పనేనా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి నోటీసులు!