/rtv/media/media_files/2025/11/10/bomb-blast-near-red-fort-in-delhi-2025-11-10-20-44-32.jpg)
Bomb blast near Red Fort in delhi
ఢిల్లీలో ఎర్రకోట సమీపంలో బాంబు పేలడం జరగడం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈ పేలుడుకు సంబంధించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. i20 కారులో ఈ పేలుడు సంభవించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పేలుడు సమీపంలో ఉన్న మిగతా వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. పేలుడు శబ్దం పెద్దగా వినిపించిందని చెబుతున్నారు. ఎకో వ్యాన్‌లో ఈ బాంబు పేలుడు జరగడంతో ఇది ఉగ్రకుట్రేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై మరింత దర్యాప్తు జరుగుతోంది.
Follow Us