DELHI BJP : బీజేపీ పెద్ద స్కెచ్.. ఏపీలో రఘురామ.. ఢిల్లీలో విజేందర్ గుప్తా!

ఢిల్లీలో సీఎం ప్రమాణ స్వీకారానికి ముందు బీజేపీ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పేర్లను కూడా ప్రకటించింది. విజేందర్ గుప్తా అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. ఆప్ ప్రభుత్వ హయాంలో మార్షల్స్‌ను పిలిచి గుప్తాను అసెంబ్లీ నుండి పలుమార్లు బయటకు పంపించింది

author-image
By Krishna
New Update
assembly speakers

ఢిల్లీలో మరికాసేపట్లో బీజేపీ ప్రభుత్వం (BJP Government) కొలువుదీరనుంది. ప్రమాణ స్వీకారానికి ముందు బీజేపీ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పేర్లను కూడా ప్రకటించింది. ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షుడు విజేందర్ గుప్తా అసెంబ్లీ స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. డిప్యూటీ స్పీకర్ పదవికి మోహన్ సింగ్ బిష్ట్ పేరును ప్రకటించింది.  విజేంద్ర గుప్తా రోహిణి అసెంబ్లీ స్థానం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవలి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) విజేంద్ర గుప్తా తన సమీప ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రదీప్ మిట్టల్‌ను దాదాపు 38 వేల ఓట్ల భారీ తేడాతో ఓడించారు. 

గత టర్మ్ లో ఆప్ అధికారంలో ఉన్నప్పుడు విజయేందర్ గుప్తా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 2015లో తమ పార్టీ ఎమ్మెల్యేను స్పీకర్ సస్పెండ్ చేయడంతో గుప్తా సభలోనే ఆందోళనకు దిగారు. దీంతో  మార్షల్స్‌  విజయేంద్ర గుప్తాను భుజాలపై ఎక్కించుకుని  అసెంబ్లీ నుండి బయటకు తీసుకెళ్లారు. కట్ చేస్తే ఇప్పుడు ఆయనే స్పీకర్ అయ్యారు. ఆప్ ప్రభుత్వంలో అవమానాలకు గురైన విజయేంద్ర గుప్తాకు  ఏకంగా అసెంబ్లీ కార్యకలాపాలను నిర్వహించే బాధ్యతను అప్పగించింది బీజేపీ. 

సరిగ్గా ఏపీలో కూడా ఇలాంటి పరిణామామే చోటుచేసుకుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా  గెలిచిన రఘరామ..ఆ పార్టీలో చాలా అవమానాలకు గురయ్యారు.  2024లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన ఆయనకు కూటమి ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ గా నియమించింది.  

Also Read :  'ఆయన్ని టీటీడీ పాలకమండలి పదవి నుంచి తొలగించాల్సిందే'.. అంటూ ఉద్యోగుల నిరసన!

Also Read :  ఏకంగా మహాకుంభమేళాలో తమన్నా ఓదెల2 టీజర్..

ఢిల్లీ కేబినెట్‌ మంత్రులు 

సీఎం రేఖా గుప్తాతో పాటుగా ఆరుగురు మంత్రలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు, ఢిల్లీ కేబినెట్‌లో ఉండే మంత్రుల జాబితా రిలీజ్ అయింది. మంత్రుల జాబితాలో ముఖ్యమంత్రి రేసులో నిలిచిన ప్రవేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా, కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్, రవీంద్ర రాజ్ పేర్లు ఉన్నాయి. ప్రమాణ స్వీకారం అనంతరం వీరందరూ పీఎం మోదీతో కలిసి లంచ్ చేయనున్నారు.  రామ్ లీలా మైదానంలో మధ్యాహ్నం 12 గంటలకు  జరగనున్న ఈ ప్రమాణస్వీకారోత్సవ వేడుకకకు ప్రధాని మోదీతో పాటుగా పలువురు కేంద్రమంత్రలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రలు, 50 మంది సెలబ్రేటీలు, వ్యాపారవేత్తలు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Also read :   ఢిల్లీకి కాబోయే కొత్త సీఎం సంచలన నిర్ణయం!

Also Read :  ఛాంపియన్స్ ట్రోఫీ.. జడేజాకు బిగ్ షాక్..!

Advertisment
తాజా కథనాలు