CM Kejriwal : ఢిల్లీలో రాష్ట్రపతి పాలన .. బీజేపీ సంచలన ప్లాన్ !

ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. ఈ మేరకు ఆమెకు వినతి పత్రం సమర్పించారు.

author-image
By B Aravind
BJP VS AAP
New Update

CM Kejriwal :

సీఎం కేజ్రీవాల్‌ ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. ఈ మేరకు ఆమెకు వినతి పత్రం సమర్పించారు. దీనిపై దృష్టి సారించిన రాష్టపతి ముర్ము ఈ లేఖను హోంశాఖకు కూడా పంపినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వ్యవహారం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకా ? లేదా బీజేపీకా ? ఏ పార్టీకి ప్రయోజనం చేకూరుతుందనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలులోనే ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి సానుభూతి ఓట్లు పడే అవకాశాలున్నాయని చాలామంది భావించారు. కానీ అది జరగలేదు. ఎన్నికల ప్రచారానికి కేజ్రీవాల్‌కు కోర్టు బెయిల్‌ కూడా ఇచ్చింది. ఢిల్లీలో మొత్తం ఏడు స్థానాల్లో కాంగ్రెస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కూడా ఆప్‌ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అక్కడ రాష్టపతి పాలన అమలు చేయడం వల్ల ఢిల్లీ ప్రజల్లో కేజ్రీవాల్‌ పట్ల సానుభూతి కలుగుతుందా ? లేదా ? అనేది ప్రశ్నార్థకంగా మారింది. అందుకే ఎలాగైనా ఢిల్లీలోని ఆప్ నేతలను ఇరుకున పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కేజ్రీవాల్‌ను ప్రభుత్వాన్ని పడగొట్టి.. తమకు అనుకూలంగా మలచుకోవాలనే మోదీ సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం.  

ఢిల్లీలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ఆగస్టు 30న రాష్ట్రపతిని కలిశారు. రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు చేయలేదని.. ఈ పథకం కింద వేల కోట్ల రూపాయల నిధులు రాకుండా పోయాయని ఆరోపించారు. కేజ్రీవాల్ జైల్లో ఉండడంతో ప్రభుత్వం సరిగా పని చేయలేకపోతోందని తెలిపారు. అంతేకాదు ఢిల్లీ జల్ బోర్డు అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, స్కామ్‌లు జరుగుతున్నాయని తెలిపారు. ఢిల్లీ ప్రజల ప్రయోజనం కోసమే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నామని పేర్కొన్నారు. 

1992లో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన తర్వాత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇలా రాష్ట్రంలో అస్థిరత్వం, అశాంతి ఉన్నప్పుడు కేంద్రం ఆయా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనలు విధిస్తుంది. కేజ్రీవాల్‌ జైల్లో ఉండటంతో రాష్ట్రంలో పరిస్థితి అస్తవ్యస్థంగా మారిందని అందుకే రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. మరోవైపు కేజ్రీవాల్‌కు త్వరలో బెయిల్‌ కూడా వచ్చే అవకాశాలున్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ కేజ్రీవాల్‌కు బెయిల్‌ రాకుంటే.. కేంద్రం రాష్ట్రపతి పాలన విధిస్తుందా ? లేదా ? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

Also Read :  నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు

#telugu-news #delhi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe