Bihar Election 2025 : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు..7 గంటలకు పోలింగ్!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్ నేడు జరుగుతోంది. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 18 జిల్లాల పరిధిలోని 121 స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.

New Update
bihar

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్ నేడు జరుగుతోంది. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 18 జిల్లాల పరిధిలోని 121 స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. తొలి దశలో మొత్తం 3.75 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ 121 స్థానాల్లో 1314 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో కీలక నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత

ఈ దశ ఎన్నికల్లోనే ప్రతిపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, ఉప ముఖ్యమంత్రులు సమ్రాట్ చౌదరి, వి.కె. సిన్హా వంటి ప్రముఖుల భవితవ్యం నిర్ణయం కానుంది. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు.

పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల ప్రకటన నవంబర్ 14న జరుగుతుంది. ఇప్పటికే పార్టీలు హోరాహోరిగా ప్రచారం చేశాయి.

Advertisment
తాజా కథనాలు