/rtv/media/media_files/2025/03/11/B0Sru4kpFTwAXx2zfXSx.jpg)
bomb attack on delhi public school
Bomb Attack: బీహార్ రాష్ట్రం హాజీపూర్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌పై గుర్తుతెలియని వ్యక్తులు బాంబులు, రాళ్లతో దాడి చేయడం కలకలం రేపుతోంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. దీనిపై పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా .. స్కూల్ బయట ఉన్న సీసీటీవీలో ఫుటేజ్ ఆధారంగా దుండగులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో స్కూల్ విద్యార్థులు, సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదు...అందరూ క్షేమంగా ఉన్నారు. దాడికి సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్‌గా మారాయి.
ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!
Breaking: A bomb attack outside Delhi Public School in Hajipur, Bihar, was caught on CCTV. Suspects threw stones and bombs at the gate. pic.twitter.com/pTXnYRKXNe
— Eye On News (@EyeOnNews24) March 11, 2025
డ్రైవర్ ను తొలగించడమే కారణమా?
అయితే ఇటీవలే స్కూల్ యాజమాన్యం ఓ డ్రైవర్ ని విధుల నుంచి తొలగించారట. ఆ కోపంతో అతడే దాడికి పాల్పడి ఉంటాడని పాఠశాల సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: అత్యంత దయనీయంగా శ్రీతేజ్ పరిస్థితి.. కనీసం కుటుంబసభ్యులను కూడా గుర్తుపట్టలేని దుస్థితి