Gigworkers : గిగ్‌వర్కర్లకు బిగ్‌ రిలీఫ్‌..పది నిమిషాల ఆన్‌లైన్ డెలివరీ ఎత్తివేత

గిగ్ వర్కర్లకు కేంద్రం ప్రభుత్వం భారీ ఉపశమనం కల్పించింది. పది నిమిషాల ఆన్‌లైన్ డెలివరీ నిర్ణయాన్నిఎత్తివేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జెప్టో, బ్లింకిట్,బిగ్ బాస్కెట్డె డెలివరీ బాయ్స్‌కు గొప్ప రిలీఫ్‌ లభించింది.

New Update
FotoJet - 2026-01-13T151101.764

Big relief for gig workers.. lifting of ten-minute online delivery

 Gigworkers : గిగ్ వర్కర్లకు కేంద్రం ప్రభుత్వం భారీ ఉపశమనం కల్పించింది. పది నిమిషాల ఆన్‌లైన్ డెలివరీ నిర్ణయాన్ని ఎత్తివేసింది. ఈ మేరకు మంగళవారం కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదేశాలు జారీ చేశారు. దీంతో -- జెప్టో, బ్లింకిట్,బిగ్ బాస్కెట్, ఇన్‌స్టా మార్ట్ తదితర గిగ్‌ వర్కర్స్‌, డెలివరీ బాయ్స్‌కు గొప్ప రిలీఫ్‌ లభించినట్లయింది.  కాగా, గత డిసెంబర్ 25, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ యాప్‌ బేస్డ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌, తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ యూనియన్‌ పిలుపు మేరకు ఈ సమ్మె జరిగింది. 10 నిమిషాల్లో డెలివరీని పూర్తిగా రద్దు చేయాలని యూనియన్‌ నేతలు డిమాండ్‌ చేశారు. దీంతో అప్రమత్తమైన కేంద్రం.. స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato), బ్లింకిట్(Blinkit) సహా అన్ని ఈ కామర్స్ సంస్థలకు కేంద్రం సూచనలు చేసింది. పది నిమిషాల నిబంధనను ఎత్తివేయాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

కాగా, గత డిసెంబర్ 25, 31 తేదీల్లో దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ యాప్‌ బేస్డ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌, తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫామ్‌ వర్కర్స్‌ యూనియన్‌ పిలుపు మేరకు ఈ సమ్మె జరిగింది. 10 నిమిషాల్లో డెలివరీని పూర్తిగా రద్దు చేయాలని యూనియన్‌ నేతలు డిమాండ్‌ చేశారు. దీంతో అప్రమత్తమైన కేంద్రం.. స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato), బ్లింకిట్(Blinkit) సహా అన్ని ఈ కామర్స్ సంస్థలకు కేంద్రం కీలక  సూచనలు చేసింది. పది నిమిషాల నిబంధనను ఎత్తివేయాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

కాగా కేంద్రం నిర్ణయానికి ముందే బ్లింకిట్‌ అప్రమత్తమైంది.‘10 నిమిషాల్లో డెలివరీ’..ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.ఇటీవల ఈ ఫీచర్‌ విషయంలో గిగ్‌ వర్కర్ల భద్రతపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

కాగా ఇటీవల భద్రతా సమస్యలపై గిగ్‌ వర్కర్లు  చేపట్టిన సమ్మెతో అల్ట్రా ఫాస్ట్‌ డెలివరీలపై మరోసారి చర్చ ఊపందుకుంది. కొత్త సంవత్సరం రోజున వీరు చేసిన సమ్మె జొమాటో, బ్లింకిట్‌ వంటి ప్లాట్‌ఫామ్‌లలో డెలివరీ సేవలపై పెద్దగా ప్రభావం చూపించనప్పటికీ.. పది నిమిషాల్లో డెలివరీ మోడల్‌ వల్ల రైడర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారన్న ప్రశ్నలు సోషల్‌ మీడియాలో ఆసక్తిని రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో దీనిపై జొమాటో (Zomato CEO) సీఈఓ దీపిందర్‌ గోయల్‌ (Deepinder Goyal ) స్పందించారు. పది నిమిషాల్లో డెలివరీ విధానంపై వివరణ ఇచ్చారు. ఈ డెలివరీ వెనుక ఉన్న అసలు రహస్యాన్ని నెటిజన్లకు అర్థమయ్యేలా వివరించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా వరుస పోస్టులు పెట్టారు.

డెలివరీ వేగం మౌలిక సదుపాయాలపై ఆధారపడి ఉంటుందని, రైడర్లపై ఒత్తిడి ద్వారా కాదని గోయల్‌ వివరించారు. ‘మీ ఇళ్ల చుట్టూ పెరుగుతున్న దుకాణాల వల్లే మా 10 నిమిషాల డెలివరీ సేవలు సాధ్యమవుతున్నాయి. డెలివరీ పార్ట్‌నర్స్‌ వేగంగా డ్రైవ్‌ చేయడం వల్ల ఇది సాధ్యం కాదు. అసలు డెలివరీ కోసం కస్టమర్‌కు మేం చేసిన టైమర్‌ ప్రామిస్‌ రైడర్‌కు యాప్‌లో కనిపించదు. బ్లింకిట్‌లో మాకు వచ్చిన ఆర్డర్‌ను ప్యాక్‌ చేయడానికి 2.5 నిమిషాల సమయం పడుతుంది. డెలివరీ సగటున 2 కిలోమీటర్ల పరిధిలోనే ఉంటుంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా 8 నిమిషాల్లో లొకేషన్‌కు రీచ్‌ అయిపోవచ్చు’ అని తెలిపారు.

అంతేకాదు, డెలివరీలు ఆలస్యమైతే తమ ఏజెంట్లకు ఎలాంటి జరిమానాలూ విధించమని, అలాగే సమయానికి డెలివరీ చేసినందుకు కూడా ప్రత్యేక ప్రోత్సాహకాలు ఏమీ ఉండవని స్పష్టం చేశారు. దీనివల్ల వారిపై ఎలాంటి ఒత్తిడి ఉండదని పేర్కొన్నారు. తమ సంస్థలో డెలివరీ పార్ట్‌నర్లకు భద్రత కల్పిస్తున్నామని, ప్రతి ఒక్కరికీ వైద్య, జీవిత బీమా అందిస్తున్నామని ఈ సందర్భంగా దీపిందర్‌ గోయల్‌ వెల్లడించారు. గిగ్‌ వర్కర్ల సమ్మె మధ్యే న్యూఇయర్‌ రోజు జొమాటో, బ్లింకిట్‌ కలిసి రికార్డు స్థాయిలో 75 లక్షల ఆర్డర్లను డెలివరీ చేసినట్లు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు