/rtv/media/media_files/2025/02/12/wEhhtnTB60MOpBl63dAg.jpg)
Banned Chinese apps are coming back in India Photograph: (Banned Chinese apps are coming back in India)
Banned Chinese apps: 2020 నాటి పరిస్థితుల కారణంగా భారత్‌లో చైనాకు చెందిన 267 యాప్‌లను బ్యాన్ చేశారు. ఇండియా సెక్యూరిటీ, ప్రైవసీ గురించి ఆలోచించి అనుమానం ఉన్న చైనా అప్లికేషన్లపై నిషేదం విధించింది కేంద్ర ప్రభుత్వం. అప్పడు కనుమరుగైన ఆ అప్లికేషన్లు ఇప్పుడు ఒక్కొక్కటిగా పేర్లు, లోగోలు మార్చుకొని మళ్లీ ఇండియాలోకి వస్తున్నాయి. ఆ చైనా యాప్‌ల పేర్లు, వెర్షన్లు మార్చి తిరిగి భారత్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాయి. వాటిలో కొన్ని యాప్‌ల యాజమాన్యం హక్కులు మారగా, మరికొన్ని చైనా కంపెనీలుగా ఉన్నాయి.
🚨 36 out of more than 200 banned Chinese apps return to Indian app stores pic.twitter.com/mfJmM57wJj
— Indian Tech & Infra (@IndiaTechInfra) February 11, 2025
Also Read: మహిళల్లో రొమ్ము కాన్సర్‌కు వేరుసెనగలు బాగా పని చేస్తాయా?
2020లో చైనాతో భారత్‌కు ఉన్న సరిహద్ధు సమస్య కారణగం ఇండియా 267 చైనా యాప్‌లను ఇండియాలో వాడకూడదని ఆదేశించింది. వాటిలో 36 యాప్‌ల లోగోలు, పేర్లు, బ్రాండింగ్‌లో చిన్నచిన్న మార్పులు చేసి మళ్లీ.. ఇండియాలో రిలీస్ చేసింది డ్రాగన్ దేశం. పాత సారాయి కొత్త సీసాలో అన్నట్లుగా ఒక్క యాప్‌ను ఇండియన్స్ వాడే విధంగా చేస్తోంది చైనా. అలా ఇప్పటికే ఫైల్ షేరింగ్ సర్వీస్, మ్యాంగో టీవీ, షాపింగ్ మాల్ టావోబావో, డేటింగ్ యాప్ టాన్ టాన్, షాపింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫైల్ షేరింగ్, కంటెంట్ క్రియేషన్‌కు చెందిన అప్లికేషన్లు ఉన్నాయి.
Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే
ఈ యాప్‌లన్నీ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకొనే అవకాశం ఉంది. ప్రముఖ ఫ్యాషన్ రిటైలర్ అయిన షీన్ యాప్ రిలయన్స్ లైసెన్సింగ్ అగ్రిమెంట్ ద్వారా ఇండియాలోకి వచ్చేసింది. నిషేధించిన యాప్‌లు క్లోన్ వెర్షన్‌లు పుట్టుకొస్తు్న్నాయి. వాటిని బ్యాన్ చేయడం కష్టంగా మారుతోంది. 2020లో బ్యాన్ చేసిన పబ్‌జీ 2021లో దక్షిణ కొరియా క్రాప్టన్ ఆధ్వర్యంలో బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియాగా తిరిగి వచ్చింది.