Bank Holidays : అక్టోబర్ లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులో తెలుసా!

ఆర్బీఐ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం అక్టోబర్ నెలలో ఏకంగా 14 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. వీటిని తెలుసుకుని బ్యాంకు పనులను ప్లాన్‌ చేసుకోవడం బెటర్‌.

New Update
Bank Holidays : మార్చిలో బ్యాంకులకు 14 రోజుల పాటు సెలవులు.. అలర్ట్‌!

మనలో చాలా మందికి ఏదోక సందర్భంలో బ్యాంకులో పని ఉంటుంది. అయితే ప్రతి నెల రాగానే బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకోవడం చాలా అవసరం.దీని వల్ల టైమ్‌ వేస్ట్‌ కాకుండా ఉంటుంది. సెప్టెంబర్‌ నెల మరో మూడు రోజుల్లో క్లోజ్‌ అవుతుంది. అక్టోబర్‌ నెల వచ్చేస్తుంది. 

 ఆర్బీఐ (RBI) విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం.. వచ్చే నెలలో బ్యాంకులకు సెలవులు భారీగా ఉన్నాయి. ఏకంగా సగం రోజుల పాటు అంటే 14 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.  గాంధీ జయంతి నుండి దసరా వరకు, ఈ నెలలో చాలా పండుగలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులకు కూడా సెలవులు రానున్నాయి.

 ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం, అక్టోబర్ నెలలో దాదాపు 14 రోజుల పాటు బ్యాంకులు క్లోజ్‌ అవ్వనున్నాయి. అక్టోబరులో ఏ రోజు ఏయే ప్రదేశాలలో బ్యాంకులకు సెలవు ఉంటుందో చూద్దామా...

Also Read :  డిప్యూటీ సీఎం ఇంట్లో చోరీ!

Bank Holidays :

అక్టోబర్ 2: గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు అనే విషయం తెలిసిందే.

అక్టోబర్ 3: నవరాత్రి ప్రారంభం, మహారాజా అగ్రసేన్ జయంతి సందర్భంగా హర్యానా, రాజస్థాన్‌లో బ్యాంకులకు సెలవు

అక్టోబర్ 6: ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెవులు
అక్టోబర్ 10: మహా సప్తమి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
అక్టోబర్ 11: మహానవమి సందర్భంగా ఏపీ, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బ్యాంకులకు అధికారులు సెలవు ప్రకటించారు. 

Also Read :  హెచ్ఎస్బీసీ కి ఆర్బీఐ భారీ జరిమానా ఎందుకంటే?

అక్టోబర్ 12: ఆయుధ పూజ, దసరా, రెండో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
అక్టోబర్ 13: ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
అక్టోబర్‌ 14: దుర్గాపూజ (దస్సేన్‌), గాంగ్టక్‌ (సిక్కిం)
అక్టోబర్‌ 16: లక్ష్మీ పూజ, అగర్తల, కోల్‌కతా
అక్టోబర్ 17: వాల్మికి జయంతి సందర్భంగా అస్సాం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, మధ్యప్రదేశ్, ఒడిశా, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బ్యాంకులు  బంద్‌.
అక్టోబర్ 20: ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
అక్టోబర్ 26: నాలుగో శనివారం కారణంగా బ్యాంకులు సెలవు
అక్టోబర్ 27: ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే
అక్టోబర్ 31: దీపావళి కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు సెలవు

Also Read :  భారత్‌లో ఫేమస్ విదేశీ పోర్న్ స్టార్ అరెస్ట్

Advertisment
Advertisment
తాజా కథనాలు