RBI Big Update: దేశంలో చెలామణి నుండి తీసివేసిన 2000 రూపాయల పింక్ నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పెద్ద అప్డేట్ ఇచ్చింది. ఒకటిన్నర సంవత్సరాల క్రితం, RBI ఈ కరెన్సీ నోట్లను చెలామణి నుండి తీసివేసింది. ఈ నోట్లను మార్చుకోవాలని లేదా బ్యాంకులో డిపాజిట్ చేయాలని ప్రజలను కోరింది. అయితే ఏడాదిన్నర గడిచినా రూ.2000 నోట్లను తమ వద్దే ఉంచుకున్న కోట్లాది మంది ఉన్నారు. వారు వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయలేదు లేదా వాటిని మార్చుకోలేదు.ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న 100 శాతం నోట్లు తిరిగి ఆర్బీఐ కి రాలేదు. ఇటీవల దీనికి సంబంధించిన వివరాలను పంచుకుంటూ, దేశంలో ఇప్పటికీ రూ.7261 కోట్ల కంటే ఎక్కువ విలువైన రూ.2000 నోట్లను ప్రజల వద్దే ఉండిపోయాయని ఆర్బీఐ తెలిపింది. ఇప్పటి వరకు 2000 రూపాయల నోట్లలో 97.96 శాతం మాత్రమే బ్యాంకులకు తిరిగి వచ్చాయి.
పూర్తిగా చదవండి..RBI Big Update: ఇంకా ఏడువేల కోట్ల రూపాయల రెండువేల నోట్లు మార్కెట్లోనే!
మార్కెట్లో ఉన్న 2వేల నోట్లు పూర్తిగా తిరిగి రాలేదు. దేశంలో ఇప్పటికీ రూ.7261 కోట్ల కంటే ఎక్కువ విలువైన 2 వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. ఇప్పటి వరకు 2000 రూపాయల నోట్లలో 97.96 శాతం మాత్రమే బ్యాంకులకు వచ్చినట్లు ఆర్బీఐ చెప్పింది
Translate this News: