బాబా సిద్ధిఖీ హత్యకు కారణం.. సల్మాన్ ఖాన్‌తో సన్నిహిత్యమేనా?

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ సల్మాన్‌ ఖాన్‌తో సన్నిహితంగా ఉండటమే హత్యకు గురయ్యారని పోలీసులు అనుమానిస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు సల్మాన్ శత్రువు.. అతనితో సిద్ధిఖీ క్లోజ్‌గా ఉండటంతో హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

FotoJet (24
New Update

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యకు గురైన సంగతి తెలిసిందే. బాంద్రాలోని తన కొడుకు జీషన్ కార్యాలయం దగ్గర రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఆటోలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతన్ని తుపాకీలతో కాల్చడంతో మరణించారు. అయితే ఈ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సిద్దిఖీ సల్మాన్‌ ఖాన్‌తో సన్నిహితంగా ఉండటం వల్ల హత్యకు గురయ్యారని అనుమానిస్తున్నారు. అయితే సిద్దిఖీకి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఎలాంటి బెదిరింపులు రాలేదు. కానీ తనకి ప్రాణహాని ఉందని వై కేటగిరీ భద్రత కల్పించాలని 15 రోజుల కిందట ఉన్నతాధికారులను కోరారట. ఇంతలోనే చనిపోవడంతో ఆ గ్యాంగ్ హస్తం ఉందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి:TATAఆదివాసి హత్యలు, ఎలక్టోరల్ బాండ్లు.. టాటాపై ఉన్నవివాదాల్లో నిజమెంత?

బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉందా?

గతంలో షారుఖ్ ఖాన్, సల్మాన్‌ ఖాన్‌కి మధ్య విభేదాలు ఉండటంతో వీరిద్దరిని సిద్ధిఖీ కలిపారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్‌కు గ‌తంలో ఎన్నోసార్లు బెదిరింపులు వ‌చ్చాయి. వారికి టార్గెట్‌గా ఉన్న స‌ల్మాన్ ఖాన్‌తో సిద్ధిఖీ ఎక్కువ స‌న్నిహితంగా ఉండ‌టం వల్ల ఈ హత్య జరగడంతో అందరూ ఆ గ్యాంగ్ పని అయి ఉంటుందని భావిస్తున్నారు. బాంద్రాకు ఆటోలో వచ్చిన ముగ్గురు దుండగులు సిద్దిఖీ కోసం వెయిట్ చేసి వచ్చిన వెంటనే మూడు రౌండ్ల కాల్పులు జ‌రిపారు. అయితే సిద్ధిఖీ గురించి ప్రతి నిమిషం అన్ని విషయాలను ఎవరో సమాచారం ఇస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరి సిద్ధిఖీని హత్య చేసింది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్? లేకపోతే ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:  TATA: ఆయన భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి: నెతన్యాహు!

#bollywood #salman-khan #baba-siddiqui
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe