ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు బాధ్యత వహిస్తున్నట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, అండర్ వరల్డ్ ఫిగర్లు దావూద్ ఇబ్రహీం, అనుజ్ థాపన్‌లతో సిద్ధిఖీకి ఉన్న సన్నిహితం వల్ల ఈ హత్య చేశామని గ్యాంగ్‌లోని ఓ సభ్యుడు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చూడండి: కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో నటాషా.. ఓ సరికొత్త అనుభూతి అంటూ పోస్ట్
బెదిరింపులు రాకపోయిన..
మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిఖీ సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా ఉండటం కారణంగా.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేశారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనుకున్నట్లుగానే బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేసినట్లు ఒప్పుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సిద్దిఖీ నిన్న రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. తన కొడుకు కార్యాలయం దగ్గర ఉన్నప్పుడు ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి అతన్ని కాల్చివేశారు. అయితే సిద్దిఖీకి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఎలాంటి బెదిరింపులు రాకపోయిన హత్యకు గురయ్యారు.
ఇది కూడా చూడండి: బాబా సిద్ధిఖీ హత్యకు కారణం.. సల్మాన్ ఖాన్‌తో సన్నిహిత్యమేనా?