స్లమ్ ప్రాజెక్టే సిద్ధిఖీ హత్యకు కారణమా? అసలేంటి ఈ ప్రాజెక్ట్?

బాబా సిద్ధిఖీ హత్యలో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. మహారాష్ట్ర హౌసింగ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో స్లమ్ ప్రాజెక్టు‌లో రూ.2000 కోట్ల భారీ స్కాం జరిగిందని పోలీసులు గుర్తించారు. ఈ విషయంలో హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

mumbai
New Update

మహారాష్ట్ర మాజీ మంత్రి సిద్ధిఖీ హత్య బాలీవుడ్‌లో పెను సంచలనం రేపుతోంది. సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా ఉండటం కారణంగా.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఓ మురికివాడ ప్రాజెక్టు విషయంలో ఉన్న విభేదాల కారణంగా బాబా సిద్ధిఖీ హత్యకు గురయ్యారని పోలీసులు తెలుపుతున్నారు.

ఇది కూడా చూడండి: తమిళనాడుకు భారీ వర్ష సూచన.. ఈ తేదీల్లో అప్రమత్తత తప్పనిసరి!

భారీ స్కాం జరిగిందనే ఆరోపణలు..

సిద్ధిఖీ గతంలో మహారాష్ట్ర హౌసింగ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో రూ.2000 కోట్లు స్కాం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో 2012లో అబ్దుల్ సలామ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా.. సిద్ధిఖీతో పాటు 150 మందిపై కేసు నమోదైంది. అయితే 2018లో ఈడీ కూడా సిద్ధిఖీకి చెందిన రూ.462 కోట్ల ఆస్తిని అటాచ్ చేసి మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ విషయంలోనే సిద్ధికీ హత్యకు గురయ్యారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: బిగ్‌బాస్ బ్యూటీ ప్రైవేట్ వీడియో లీక్ వైరల్.. ఎంజాయ్ చేసుకోమని రిప్లై

బాంద్రాలోని తన కుమారుడు కార్యాలయం ముందు టపాసులు కాలుస్తున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు సిద్ధిఖీని కాల్చి చంపారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరో నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. 

ఇది కూడా చూడండి: CID: ఆ కేసు సీఐడీకి.. వైసీపీకి చంద్రబాబు సర్కార్ మరో షాక్!

#murder #baba-siddiqui
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe