Ayodhya: అయోధ్యలో ఆంక్షలు: 15 కి.మీ పరిధిలో మటన్, చికెన్ షాపులపై నిషేధం

అయోధ్య రామమందిరానికి 15 కిలోమీటర్ల పరిధిలో మాంసాహారం విక్రయించడమే కాకుండా, ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేయడంపై కూడా అధికారులు నిషేధం విధించారు. అయోధ్యలోని 'పంచకోశి పరిక్రమ' మార్గం అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు.

New Update
no non-veg zone

అయోధ్య రామమందిరం పరిధిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింధి. శ్రీరామ జన్మభూమి అయోధ్యను ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. రామమందిరానికి 15 కిలోమీటర్ల పరిధిలో మాంసాహారం విక్రయించడమే కాకుండా, ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేయడంపై కూడా అధికారులు నిషేధం విధించారు.

అయోధ్యలోని 'పంచకోశి పరిక్రమ' మార్గం అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. అయితే ఇటీవల స్విగ్గీ, జొమాటో వంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా ఈ పవిత్ర పరిధిలోకి మాంసాహార పదార్థాలు సరఫరా అవుతున్నాయని అధికారులకు అనేక ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన జిల్లా యంత్రాంగం, ఆలయ పవిత్రతను. భక్తుల మనోభావాలను కాపాడటమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఆంక్షలు ఎక్కడెక్కడ వర్తిస్తాయి?

ఆన్‌లైన్ డెలివరీ: 15 కిలోమీటర్ల పరిధిలో ఆన్‌లైన్ ద్వారా నాన్-వెజ్ ఆహారం సరఫరా చేయడంపై పూర్తి నిషేధం ఉంటుంది.
హోటళ్లు, హోమ్‌స్టేలు: పర్యాటకులు లేదా భక్తులకు హోటళ్లలో నాన్-వెజ్ వడ్డించకూడదు. అతిథులకు మద్యం సరఫరా చేయడంపై కూడా హెచ్చరికలు జారీ చేశారు.
ప్రధాన మార్గాలు: రామ్ పథ్, ధర్మ పథ్, భక్తి పథ్ వంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల్లో మటన్, చికెన్, చేపలు అన్నీ మాంసాహరం పూర్తిగా నిలిచిపోనున్నాయి.

అధికారుల పర్యవేక్షణ:

అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ మాణిక్ చంద్ర సింగ్ ఈ ఉత్తర్వులను ధృవీకరిస్తూ, అన్ని హోటళ్లు, దుకాణదారులు, ఫుడ్ డెలివరీ సంస్థలకు ముందస్తు సమాచారం ఇచ్చామని తెలిపారు. ఈ నిబంధనలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని, ఎవరైనా ఉల్లంఘిస్తే వారి లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సాధుసంతులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్య వంటి పుణ్యక్షేత్రంలో మాంసం, మద్యం వాసన కూడా ఉండకూడదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కేఎఫ్‌సీ, డొమినోస్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా అయోధ్యలో కేవలం శాఖాహార మెనూతోనే తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. ఇలాంటి ఆంక్షలు విధించడం వల్ల అయోధ్య ఆధ్యాత్మిక శోభ మరింత వెల్లివిరుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisment
తాజా కథనాలు