/rtv/media/media_files/sFoE4HmVMzHYvxWWW5FP.jpg)
ఢిల్లీ కొత్త సీఎంగా ఆప్ నేత అతిషి ప్రమాణస్వీకారం చేశారు. శనివారం సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం అతిషి ఆర్థక, విద్య, పీడబ్య్లూడీ, రెవెన్యూతో పాటు పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమెతో పాటు మరో ఐదుగురు నేతలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇటీవల జైల్ నుంచి బెయిల్‌పై విడుదలైన మాజీ సీఎం కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయగా.. ఆప్ ఎమ్మెల్యేలు అతిషీని సీఎంగా ఎన్నుకున్నారు. దేశ చరిత్రలో సీఎం పదవిని దక్కించుకున్న 17వ మహిళగా అతిషి నిలిచారు.
Also Read: జానీ మాస్టర్ కేసులో దిమ్మ తిరిగే ట్విస్ట్
అంతేకాదు అత్యంత పిన్న వయసులోనే ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న మహిళగా కూడా అతిషి (43) నిలిచారు. 1998 నుంచి 2013 వరకు ఢిల్లీకి 15 ఏళ్ల పాటు వరుసగా షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేసి ఆప్ అధికారంలోకి వచ్చింది. 1998లో సుష్మా స్వరాజ్ కూడా 52 రోజుల పాటుగా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే షలా దీక్షిత్ సీఎంగా బాధ్యతలు చేపట్టేనాటికి ఆమె వయసు 60 ఏళ్లు. సుష్మాస్వరాజ్ 46 ఏళ్ల వయసులో సీఎం గద్దె ఎక్కారు. ఇక అతిషి మాత్రమ 43 ఏళ్లకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిచారు.
అతిషి తన వాక్చాతుర్యంతో విపక్షాలను ముప్పు తిప్పలు పెట్టగలదు. లిక్కర్ కేసు వల్ల ఆప్ ప్రతిష్ఠ దిగజారకుండా పార్టీని నిలబెట్టే బాధ్యతను అతిషి తన భుజస్కందాలపై మోసుకెళ్లారు. ఆప్ నేతల్లో చాలామంది జైలుకు వెళ్లడంతో సౌరభ్ భరద్వాజ్‌తో కలిసి అతిషి పార్టీని ముందుకు నడిపించారు. హర్యానా నుంచి ఢిల్లీకి 100 మిలియన గ్యాలన్ల నీటిని విడుదల చేయాలంటూ ఈ ఏడాది జూన్‌లో ఆమె నిరాహర దీక్ష కూడా చేశారు.
#WATCH | AAP leader Atishi takes oath as Chief Minister of Delhi pic.twitter.com/R1iomGAaS9
— ANI (@ANI) September 21, 2024
Follow Us