Jani Master: జానీ మాస్టర్ కేసులో దిమ్మ తిరిగే ట్విస్ట్

జానీ మాస్టర్‌ భార్యపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. లేడీ కొరియోగ్రాఫర్‌ ఇంటికి వెళ్లి దాడి చేసినందుకు చర్యలు చేపట్టనున్నారు. జానీ మాస్టర్‌ భార్యతో పాటు మరో ఇద్దరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
jani master wife

Jani Master: జానీ మాస్టర్ కేసులో దిమ్మ తిరిగే ట్విస్ట్ చోటుచేసుకుంది. జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. గతంలో జానీ మాస్టర్‌తో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి దాడి చేసినందుకు పోలీసుల చర్యలు చేపట్టారు. ఇప్పటికే బాధితురాలు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో జానీ భార్యను నిందితురాలుగా చేర్చాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జానీ భార్యతో పాటు మరో ఇద్దరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

10 రోజుల కస్టడీకి..

ఇవాళ ఉప్పరపల్లి కోర్టులో నార్సింగి పోలీసుల పిటిషన్ పై విచారణ జరగనుంది. జానీ మాస్టర్‌ను 10 రోజుల కస్టడీకి న్యాయస్థానాన్ని పోలీసులు కోరనున్నారు. కస్టడీలో కీలక విషయాలను రాబడుతామని పోలీసులు అంటున్నారు. మరోవైపు జానీ మాస్టర్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచనాలు విషయాలు బయటకు వచ్చాయి. జానీ మాస్టర్‌ నేరాన్ని అంగీకరించారని పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. 

2020లోనే అత్యాచారం..

2019 లోనే బాధితురాల తో తనకు పరిచయం ఉందని జానీ మాస్టర్‌ పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది. రిమాండ్ రిపోర్ట్ లో ఇలా... దురుద్దేశంతోనే బాధితురాలిని అసిస్టెంట్‌గా చేర్చుకున్నారు. 2020 జనవరి 20న ముంబైలోని హోటల్‌లో బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నాలుగేళ్లుగా బాధితురాలిపై లైంగిక దాడి కొనసాగింది. విషయం బయటకు రావద్దని బాధితురాలికి బెదిరింపులు చేశాడు.

సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరింపులు చేసినట్లు ఒప్పుకున్నాడు. షూటింగ్‌ ల పేరుతో వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి హోటల్స్‌లో లైంగిక దాడి చేసినట్లు పోలీసులకు వాగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. తొలిసారి జానీ మాస్టర్‌ లైంగిక దాడి చేసినప్పుడు బాధితురాలి వయస్సు 16 ఏళ్లు. కాగా బాధితురాలు మైనర్ గా ఉన్నప్పుడు అత్యాచారం చేసినందుకు జానీ మాస్టర్ పై ఇప్పటికే పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ పై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది వేచి చూడాలి.

 

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు