Atishi : ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ

ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అతీశీని తమ తదుపరి సీఎంగా ఆప్ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఈ రోజు జరిగిన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది.

New Update

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ ఎంపికయ్యారు. ఈ రోజు నిర్వహించిన శాసనసభ పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఆమెవైపే మొగ్గు చూపారు. ఆతిశీ మర్లెనా సింగ్ ప్రస్తుతం విద్యాశాఖ, దివ్యాంగుల శాఖకు మంత్రిగా ఉన్నారు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అయిన ఆతిషి.. ఢిల్లీలోని పాఠశాలల విద్యా పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఆమె ఎంతో కృషి చేశారు. లిక్కర్‌ కేసులో మనీశ్ సిసోడియా అరెస్టయిన అనంతరం అతిషి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కేజ్రీవాల్, సిసోడియా జైల్లో ఉన్నప్పుడు.. పార్టీ బాధ్యతలు తీసున్నారు.

మరో విషయం ఏంటంటే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమానికి ఆతిషియే జాతీ జెండా ఎగురవేయాలని కేజ్రీవాల్ సూచించారు.దీన్ని పరిశీలిస్తే కేజ్రీవాల్ కు ఆమెపై ఎంత నమ్మకం ఉందే అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈ రోజు సాయంత్రం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. లెఫ్ట్ నెంట్ గవర్నర్ ను కలిసి ఆయన తన రాజీనామాను సమర్పించనున్నారు.అనంతరం కొత్త సీఎంతో లెఫ్ట్ నెంట్ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది.

#atishi #delhi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe