/rtv/media/media_files/2025/05/06/zOg5cY1hM5eJsNbvBF0U.jpg)
అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్, భారత్ మధ్య వివాదాలు తారాస్తాయికి చేరాయి. గతకొన్ని రోజులు క్రితం అస్సాంలో పాకిస్తాన్ మద్దతుదారులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓ కాంగ్రెస్ ఎంపీపై హాట్ కామెంట్స్ చేశారు. ఎంపీ గౌరవ్ గగోయ్ భార్యకు పాకిస్తాన్ సైన్యంతో సంబంధాలు ఉన్నాయని ఆయన అన్నారు. గౌరవ్ భార్య ఎలిజబెత్ కోల్‌బర్న్ పాకిస్తాన్‌కు 19 సార్లు ప్రయాణించారని హిమంత బిశ్వశర్మ మీడియా సమావేశంలో వెల్లడించారు. పాకిస్థాన్‌లో ఆమెకు ఆ దేశ ఆర్మీ సహకరించినట్లు ఆయన చెప్పారు. పాకిస్థాన్‌లో కోల్‌బర్న్ పనిచేశారని, ఆ తర్వాత ఆమె ఢిల్లీలోని ఎన్జీవోలో చేసినట్లు చెప్పారు. కానీ పాకిస్థాన్ నుంచి ఆమె ఇప్పటికీ రెగ్యులర్‌గా జీతం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎంపీ గౌరవ్ గగోయ్ కూడా పాకిస్థాన్‌కు వెళ్లినట్లు బిశ్వశర్మ తెలిపారు.
#watch #AssamCM @himantabiswa takes snide dig at Congress MP @GauravGogoiAsm alleging his wife of having good relations with #Pakistanarmy. He further stated that the MP has stayed in Islamabad and also tried to rationalise youths during his stay. #Assam #bignmews pic.twitter.com/jJ2RiPEWAy
— Asom Live 24 (@AsomLive24) May 6, 2025
వారం రోజుల్లో ఆయన భార్య ఇండియాకు తిరిగి వచ్చిందని, కానీ గగోయ్ మాత్రం అక్కడే మరో 7 రోజులు ఉన్నట్లు చెప్పారు. పాకిస్తాన్‌లో 15 రోజుల పాటు గగోయ్ ఏం చేశారో చెప్పాలని అస్సాం సీఎం ప్రశ్నించారు. పాకిస్థాన్‌లో అతనేం చేశారో చెప్పాలని, వాళ్ల ఆర్మీకి ఎలా ఆయన సహకరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అధికార హోదాలో గగోయ్ పాకిస్థాన్‌కు వెళ్తే దాన్ని ప్రశ్నించే వాళ్లం కాదు అని, కానీ ఆయన తన వ్యక్తిగత పనిమీద వెళ్లారని అన్నారు. పాకిస్తాన్‌లో ఆయన ఎవరితో ఏం మాట్లాడారో తెలియాలని బిశ్వ శర్మ చెప్పారు.
( MP Gaurav Gogoi | assam-cm | himanta-sarma )