అరుణాచల్‌ప్రదేశ్‌లో రెండేళ్ల క్రితం సంచలనం రేపిన అత్యాచార కేసులో పోక్సో ప్రత్యేక కోర్టు కీలక తీర్పునిచ్చింది. 21 మంది విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడ్డ హాస్టల్ వార్డెన్‌కు మరణ శిక్ష విధించింది. ఇదే కేసులో స్కూల్ మాజీ ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో టీచర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. 2022లో అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్‌లో లైంగిక దాడుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన 12 ఏళ్ల కవల కూతుళ్లను హాస్టల్ వార్డెన్ లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరికొందరు బాధితులు కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు.
Also read: సిద్ధరామయ్యకు బిగ్ షాక్.. ముడా స్కామ్‌పై విచారణకు కోర్టు పర్మిషన్
దీంతో ఈ వ్యవహారంపై విచారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. చివరికి హాస్టల్ వార్డెన్ చేసిన అరాచకాలు బయటపెడ్డాయి. 2014-2022 మధ్యకాలంలో అతడు 21 మంది మైనర్లపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడినట్లు విచారణలో తేలింది. బాధితుల్లో ఆరుగురు బాలురు (6 - 8 ఏళ్ల వయసున్న) సైతం ఉన్నట్లు బయటపడింది. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది జులైలో దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. హాస్టల్ వార్డెన్.. లైంగిక దాడికి పాల్పడేముందు బాధితులకు మత్తుమందు ఇచ్చేవాడు. ఆ తర్వాత ఈ విషయాలు బయట చెప్పకూడదని బెదిరించేవాడు. అతడి అరాచకాలు భరించలేక ఆరుగురు బాధితులు సూసైడ్ చేసేందుకు కూడా ప్రయత్నించాడు.
హాస్టల్ వార్డెన్ ఆగడాల గురించి ఓ మహిళా టీచర్‌కు బాధిత చిన్నారులు ఫిర్యాదు చేశారు. అయినా కూడా ఆమె అధికారుల దృష్టికి తీసుకెళ్లలేదని దర్యాప్తులో తేలింది. చివరికి ఈ వ్యవహారం పోక్సో న్యాయస్థానం వద్దకు చేరింది. ఈ కేసులో దోషిగా తేలిన హాస్టల్ వార్డెన్‌కు కోర్టు మరణశిక్ష విధించింది. మరో మహిళా టీచర్‌కు 20 మహిళా టీచర్‌కు 20 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించింది.
Also Read: రచ్చ అవుతున్న బద్లాపూర్ నిందితుడు ఎన్‌కౌంటర్